సామ్రాజ్య భారతి: 1865/1947, ఘట్టాలు, చట్టాలు, జననాలు

9 Jun, 2022 12:26 IST|Sakshi

ఘట్టాలు
► బిహార్, గయ ప్రాంతంలోని షెర్గాటీ అనే ప్రదేశంలో గ్రహశకలం పడింది. ఆ శకలానికి షెర్గాటీ అని పేరుపెట్టారు.
► ముంబైలో ప్రతిష్టాత్మకమైన బహుళ వ్యాపారాల ‘షాపూర్జీ పల్లోంజీ గ్రూపు’ స్థాపన జరిగింది. 
► బ్రిటిష్‌ ఇండియా భూటాన్‌ ఓడించి.. అస్సాం, బెంగాల్‌ లలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించింది. 

చట్టాలు
ఇండియన్‌ సక్సెషన్‌ యాక్ట్, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్,  ఇండియా ఆఫీస్‌ సైట్‌ అండ్‌ అప్రోచ్‌ యాక్ట్, ఇండియన్‌ హైకోర్ట్‌ యాక్ట్, ఇండియన్‌ ఫారెస్ట్‌ యాక్ట్‌లకు రూపకల్పన జరిగింది. 

జననాలు
లాలా లజపతి రాయ్, రుడ్‌యార్డ్‌ కిప్లింగ్, ఆనందిని గోపాల్‌ జోషి, మహారాజ భగవత్‌సింహ్‌జీ సాహిబ్, శాస్త్రీజీ మహరాజ్, సతీశ్‌చంద్ర ముఖర్జీ జన్మించారు. రాయ్‌ (పంజాబ్‌) భారత స్వాతంత్య్ర సమరోద్యమ నాయకులు. కిప్లింగ్‌ (బాంబే) రచయిత. ఆనందిని (బాంబే) భారతదేశ తొలి వైద్యురాలు. భగవత్‌సింహ్‌జీ (గుజరాత్‌) గోండల్‌ సంస్థానాధీశులు. శాస్త్రీజీ మహరాజ్‌ స్వామినారాయణ్‌ (గుజరాత్‌) సంప్రదాయ యజ్ఞపురుషుడు, సతీశ్‌చంద్ర ముఖర్జీ (హూగ్లీ) జాతీయ విద్యా విధాన సంస్థాపకులు.

మరిన్ని వార్తలు