శతమానం భారతి: నవ భారతం

24 Jun, 2022 11:55 IST|Sakshi

2014లో ప్రధానిగా పదవీ ప్రమాణం చేసిన మోదీ, ‘నవభారతం’ నిర్మించేందుకు కంకణబద్ధులయ్యారు. ‘అందరి సహకారం–అందరి కృషి–అందరి ప్రగతి–అందరి విశ్వాసం’ అనే సూత్రంతో ఆయన పని చేస్తున్నారు. మోదీ తొలిదఫా ప్రభుత్వం పునరుజ్జీవం, పునరుత్తేజంపై సంపూర్ణంగా దృష్టి సారించి, సంస్కరణల ద్వారాలు పూర్తిగా తెరిచింది. పేదలకు ప్రయోజనాల కల్పన దిశగా తొలి మార్గంకింద ‘జనధన్‌'  యోజన, ఆధార్‌ బలోపేతం, మొబైల్‌ఫోన్‌  వినియోగం’ అమలులోకి వచ్చాయి. ‘పెన్షన్లు, రేషన్, ఇంధనం, అర్హులైన వారికి సమ్మాన్‌ 'నిధి’ వంటి లబ్ధిని నేరుగా వారి ఖాతాల్లోనే జమచేయడానికి వీలు కల్పించే ‘ప్రత్యక్ష లబ్ధి బదిలీ’ (డీబీటీ) అమలులోకి వచ్చింది. 

ఈ కసరత్తుతో పన్ను చెల్లింపు దారు లైన ప్రజలకు అనుబంధ ప్రయోజనాలు అందివచ్చాయి. మరోవైపు దేశవ్యాప్తంగా రకరకాల పన్నులున్న నేపథ్యంలో ‘వస్తు సేవల పన్ను’ (జీఎస్టీ) వ్యవస్థ వాటన్నిటినీ ఏకం చేసింది. ఇక మోదీ రెండోదఫా అధికారంలోకి వచ్చాక ప్రపంచ మహమ్మారి పరిస్థితుల్లోనూ ఆర్థిక దిద్దుబాటు వేగం కొనసాగింది. మహమ్మారి సమయంలో ఏ ఒక్కరూ ఆకలిదప్పులతో అల్లాడకుండా చూడాలన్న సంకల్పం సత్ఫలితాలిచ్చింది.

ఆ మేరకు దేశంలో దాదాపు 80 కోట్ల మందికి పూర్తిగా 8 నెలలపాటు ఆహారధాన్యాలు ఉచితంగా సరఫరా చేశారు. నాలుగుసార్లు ప్రకటించిన ‘స్వయం సమృద్ధ భారతం’ ప్యాకేజీలతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో పాటు వర్తకులు, చిరుద్యోగులకు సకాలంలో చేయూతనిచ్చారు. ఇవే కాదు, రానున్న ఏళ్లలో ప్రజలతో మమేకమైన మరిన్ని పురోగతి ప్రణాళికలు తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

(చదవండి:  గుజరాత్‌ అల్లర్లు: మోదీ వ్యతిరేక పిటిషన్‌ కొట్టివేత)

మరిన్ని వార్తలు