సామ్రాజ్య భారతి 1885/1947

29 Jun, 2022 10:24 IST|Sakshi

ఘట్టాలు
కాంగ్రెస్‌ పార్టీని స్థాపించడం కోసం బాంబేలోని గోకుల్‌దాస్‌ తేజ్‌పాల్‌ సంస్కృత కళాశాలలో 72 మంది న్యాయవాదులు, విద్యావేత్తలు, పాత్రికేయులు సమావేశం అయ్యారు. డబ్లు్య.సి.బెనర్జీ, ఎ.ఓ.హ్యూమ్, దాదాభాయి నౌరోజీ ఆ పార్టీకి ‘భారత జాతీయ కాంగ్రెస్‌’ (ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌) అని పేరు పెట్టారు. పార్టీ తొలి అధ్యక్షుడిగా డబ్లు్య.సి.బెనర్జీ, తొలి కార్యదర్శిగా ఎ.ఓ.హ్యూమ్‌ ఎంపికయ్యారు. 

చట్టాలు
ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్ట్, ల్యాండ్‌ అక్విజిషన్‌ (మైన్స్‌) యాక్ట్, ఈస్టిండియా అన్‌క్లెయిమ్డ్‌ స్టాక్‌ యాక్ట్, ఈస్టిండియా లోన్‌ యాక్ట్, ఇండియన్‌ ఆర్మీ పెన్షన్‌ డెఫిషియన్సీ యాక్ట్, ఎవిడెన్స్‌ బై కమిషన్‌ యాక్ట్‌ 

జననాలు
మాస్టర్‌ తారాసింగ్‌ : సిక్కు మతగురువు, రాజకీయనేత (హరియాల్, పాకిస్థాన్‌); నారాయణ్‌ మహారాజ్‌ : ఆథ్యాత్మిక గురువు (కర్ణాటక); పోట్టం ఎ. థనుపిళ్లై : స్వాతంత్య్రోద్యమ కార్యకర్త, కేరళ ముఖ్యమంత్రి (తిరువనంతపురం); రఖల్‌దాస్‌ బెనర్జీ : పురావస్తు శాస్త్రవేత్త, మ్యూజియం సంరక్షక అధికారి (పశ్చిమ బెంగాల్‌); ముహమ్మద్‌ షహీదుల్లా : బెంగాలీ భాషాశాస్త్రవేత్త, విద్యావేత్త, రచయిత. 2004 బి.బి.సి. ‘గ్రేటెస్ట్‌ బెంగాలీ ఆఫ్‌ అల్‌ టైమ్‌’ పోల్‌లో ఆయన 16 వ ర్యాంకులో నిలిచారు. (పశ్చిమ బెంగాల్‌); కవిశేఖర డాక్టర్‌ ఉమర్‌ అలీషా: పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆథ్యాత్మిక పీఠం అధిపతి (ఆంధ్రప్రదేశ్‌); సన్నప పరమేశ్వర్‌ గాంవ్‌కర్‌ : రాజకీయనేత, రచయిత (ఉత్తర కర్ణాటక).

మరిన్ని వార్తలు