సామ్రాజ్య భారతి 1887/1947

1 Jul, 2022 11:16 IST|Sakshi

ఘట్టాలు
1. ఇంటిలిజెన్స్‌ బ్యూరో స్థాపన. అప్పట్లో ఈ బ్యూరోను ‘సెంట్రల్‌ స్పెషల్‌ బ్రాంచ్‌’ అని వ్యవహరించేవారు. రష్యన్‌లు ఆప్ఘనిస్థాన్‌ను ఆక్రమించడం ద్వారా బ్రిటిష్‌ ఇండియాపై దాడి చేసే ప్రమాదాన్ని పసిగట్టి, ఆ దాడిని నివారించేందుకు ఆనాటి ‘సెంట్రల్‌ స్పెషల్‌ బ్రాంచ్‌’ ఒక నిఘా సంస్థగా ఏర్పాటైంది.  2. ట్రినిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ తొలిసారి ముంబైలో సంగీత పరీక్షలు నిర్వహించింది.

చట్టాలు
ప్రొవిన్షియల్‌ స్మాల్‌ కాజ్‌ కోర్ట్స్‌ యాక్ట్, సూట్స్‌ వాల్యుయేషన్‌ యాక్ట్, కన్వర్షన్‌ ఆఫ్‌ ఇండియా స్టాక్‌ యాక్ట్, బ్రిటిష్‌ సెటిల్మెంట్‌ యాక్ట్‌. సూపరాన్యుయేషన్‌ యాక్ట్, అప్పెలెట్‌ జ్యూరిస్‌డిక్షన్‌ యాక్ట్‌

జననాలు
బెనెగల్‌ నర్సింగ్‌రావ్‌ : న్యాయ నిపుణులు, దౌత్యవేత్త, భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన రాజనీతిజ్ఞులు; శ్రీనివాస రామానుజన్‌ : గణిత మేధావి (తమిళనాడు); జామినీ రాయ్‌ : తైలవర్ణ చిత్రకారులు (పశ్చిమ బెంగాల్‌); కె.ఎం.మున్షీ : స్వాతంత్య్రోద్యమ నాయకుడు (గుజరాత్‌); గోవింద్‌ వల్లభ్‌ పంత్‌ : స్వాతంత్య్ర సమర యోధులు (ఉత్తరాఖండ్‌); మానబేంద్రనాథ్‌ రాయ్‌ : విప్లవకారుడు, ర్యాడికల్‌ యాక్టివిస్టు (బెంగాల్‌ ప్రావిన్స్‌); ఎస్‌. సత్యమూర్తి : భారత స్వాతంత్య్రోద్యమ నాయకులు (తమిళనాడు); ఆర్కాట్‌ రామస్వామి ముదలియార్‌ : న్యాయకోవిదులు, రాజనీతిజ్ఞులు (ఆంధ్రప్రదేశ్‌); గిరీంద్ర శేఖర్‌ బోస్‌ : సైకోఎనలిస్ట్‌ (బిహార్‌); కె. శ్రీనివాసన్‌ : పాత్రికేయుడు, కస్తూరి రంగ అయ్యంగార్‌ కుమారుడు (తమిళనాడు); సరోజ్‌ నళినీ దత్తా : స్త్రీవాది, సంఘ సంస్కర్త (పశ్చిమ బెంగాల్‌); పి. వరదరాజులు నాయుడు : స్వాతంత్య్రోద్యమ కార్యకర్త, వైద్యులు, సామాజిక కార్యకర్త (తమిళనాడు).

మరిన్ని వార్తలు