సామ్రాజ్య భారతి: 1902/1947..ఇండియాలో మొదటి మోటార్‌ సైకిల్‌

16 Jul, 2022 15:41 IST|Sakshi
సైకిల్‌ కాదిది.. మోటార్‌ సైకిల్‌! 

ఘట్టాలు
ఇండియాలో మొదటి మోటార్‌ సైకిల్‌

ప్రముఖ రేసర్‌.. ఆస్కార్‌ హెడ్‌స్ట్రామ్‌ యు.ఎస్‌.లోని ‘హెన్డీ మాన్యు ఫాక్చరింగ్‌ కంపెనీ’ కోసం డిజైన్‌ చేసిన మోటార్‌ సైకిల్‌ ఇది. ఆ కంపెనీ 1902లో ఇలాంటివి 143 సైకిళ్లను తయారు చేసి మొదటి బ్యాచ్‌ సైకిళ్లను ఇండియా పంపింది. వాటిల్లో ఒకటి ఈ మోటార్‌ సైకిల్‌.

మరికొన్ని ఘట్టాలు 
ఆగ్రా, అవ«ద్‌లతో యునైటెడ్‌ ప్రావిన్స్‌ల ఏర్పాటు. ఈ సంయుక్త ప్రావిన్సులు 1947 వరకు ఉనికిలో ఉన్నాయి. 
అనుశీలన్‌ సమితి స్థాపన. భారతదేశంలో ఆంగ్లేయుల పరిపాలనను అంతమొందించే లక్ష్యంతో బెంగాల్లోని వ్యాయామశాలల్లో కసరత్తులు చేసే కొందరు యువకులు ఏర్పాటు చేసిన విప్లవ సంస్థ ఇది.  

చట్టాలు
ఇండియన్‌ యూనివర్సిటీస్‌ కమిషన్‌ ఏర్పాటు. 

జననాలు
జయప్రకాశ్‌ నారాయణ్‌ : భా.స్వా.స.యో., రాజకీయవేత్త (బిహార్‌); కె.ఎస్‌.పిళ్లై : ప్రముఖ కార్టూనిస్టు (కేరళ); సముద్రాల రాఘవాచార్య : సముద్రాల సీనియర్‌గా ప్రఖ్యాతి. రచయిత, నిర్మాత, దర్శకులు, నేపథ్య గాయకులు (ఆం.ప్ర); స్థానం నరసింహారావు : రంగస్థల ప్రముఖులు (ఆం.ప్ర)

మరిన్ని వార్తలు