మహోజ్వల భారతి: సృజనాత్మక సంచలనం సల్మాన్‌ రష్దీ

19 Jun, 2022 12:59 IST|Sakshi

వ్యక్తులు, సందర్భాలు (ప్రీ–ఫ్రీడమ్, పోస్ట్‌ ఫ్రీడమ్‌)

సల్మాన్‌ రష్దీ  భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్‌ నవలా రచయిత, వ్యాసకర్త. 1981లో తన రెండవ నవల మిడ్‌నైట్‌ చిల్డ్రన్‌ బుకర్‌ ప్రైజు గెలవడంతో తొలిసారిగా వార్తల్లోకి వచ్చారు. సల్మాన్‌ ప్రారంభంలో రాసిన కాల్పనిక సాహిత్యమంతా భారత ఉపఖండం నుంచి జనించినదే. ఆయన శైలిని చారిత్రక కాల్పనికతతో మిళితమైన మ్యాజిక్‌ రియలిజంగా వర్గీకరిస్తూ ఉంటారు. 

సల్మాన్‌ నాలుగవ నవల ‘శటానిక్‌ వర్సెస్‌‘ (సైతాను వచనాలు) సంచలనాత్మక, వివాదాస్పద నవల. అనేక దేశాలలో నిషేధానికి గురైంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో ముస్లింలు దీనికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపారు. సల్మాన్‌ను చంపేస్తామని బెదరింపులు కూడా వచ్చాయి. ముంబైలో జన్మించిన ఆయన, ఇంగ్లండ్‌ పౌరసత్వం తీసుకుని ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. సల్మాన్‌ రష్దీ వయసు 74 ఏళ్లు. నేడు సల్మాన్‌ రష్దీ జన్మదినం. 1947 జూన్‌ 19న పుట్టారు.

మరిన్ని వార్తలు