జైహింద్‌ స్పెషల్‌: ఐ.ఎన్‌.ఎస్‌. విక్రాంత్‌

15 Jun, 2022 13:27 IST|Sakshi

ఇండియన్‌ నేవీ షిప్‌ విక్రాంత్‌ భారత నౌకాదళానికి చెందిన మెజెస్టిక్‌–క్లాస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌. సంస్కృతంలో విక్రాంత్‌ అంటే ‘ధైర్యవంతుడు‘ అని అర్థం. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్‌ రాయల్‌ నేవీ కోసం హెచ్‌.ఎం.ఎస్‌. హెర్క్యులస్‌గా దీని నిర్మాణం ప్రారంభించారు. ఆలోపు యుద్ధం ముగియడంతో ఆ యుద్ధనౌక నిర్మాణం పనులు ఆగిపోయాయి. భారతదేశం 1957లో ఆ అసంపూర్ణ విమాన వాహక నౌకను కొనుగోలు చేసింది, 1961లో నిర్మాణం పూర్తయింది.

విక్రాంత్‌ భారత నావికాదళం మొదటి విమాన వాహక నౌకగా ఆ ఏడాదే రంగంలోకి దిగింది. 1971 ఇండో–పాకిస్తాన్‌ యుద్ధంలో తూర్పు పాకిస్థాన్‌పై నౌకాదళ దిగ్బంధనాన్ని అమలు చేయడంలో కీలక పాత్ర పోషించింది. తరువాతి సంవత్సరాలలో 1997 జనవరిలో విక్రాంత్‌ ఆపరేషన్‌లను నిలిపివేయడానికి ముందు విక్రాంత్‌ను ఆధునిక విమానాల పార్కింగ్‌ కోసం భారీ స్థాయిలో పునర్నిర్మించారు. విక్రాంత్‌ 2012 వరకు ముంబైలోని కఫ్‌ పరేడ్‌లో మ్యూజియం షిప్‌గా భద్రపరిచారు. సుప్రీంకోర్టు తుది అనుమతి అనంతరం 2014 జనవరిలో ఆన్‌లైన్‌ వేలం ద్వారా ప్రభుత్వం విక్రాంత్‌ను విక్రయించింది. 

మరిన్ని వార్తలు