ఇండియా@75: సబ్‌ కా ప్రయాస్‌

12 Aug, 2022 18:28 IST|Sakshi

భారత 75వ స్వాతంత్య్ర దినాన్ని ఉత్సవంగా నిర్వహించుకోవాలన్న నవ భారత నిర్మాణ సంకల్పంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తూ, సరికొత్త కార్యక్రమాలు, పథకాలతో దేశ వర్తమాన, భవిష్యత్తు ప్రణాళికలను రూపుదిద్దింది. తద్వారా దేశం శతాబ్ది (100వ) స్వాతంత్య్ర వేడుకల్ని నిర్వహించుకునే నాటికి ప్రతి ఒక్కరి కృషితో స్వయం సమృద్ధ భారత స్వప్నం సాకారమౌతుంది. అయితే, స్వాతంత్య్ర పునాదులపై ప్రత్యక్షం కాబోయే ఈ బృహత్‌ నిర్మాణం ఒక్కటే మన జాతి గమ్యం కాదు.

నవ భారతావని రూపు దిద్దుకోవడానికి ఇది ఆరంభం మాత్రమే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాలను ప్రజల భాగస్వా మ్యంతో ఒక సంకల్పం స్థాయికి చేర్చడం ద్వారా దేశ ప్రగతిని ముందు తీసుకెళుతున్నారు. మన సుసంపన్న వారసత్వం మనకో సరికొత్త గుర్తింపు దిశగా బాటలు వేస్తుండగా, ‘సబ్‌ కా ప్రయాస్‌’ తారక మంత్రంతో స్వర్ణ భారతావని నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నారు.

నాటి స్వాతంత్య్ర సమరంలో సామాన్య ప్రజల భాగస్వామ్యం అధికంగా ఉండేది. చరఖా, ఉప్పు వంటివి స్వాతంత్య్ర ఉద్యమంతో ప్రజల్ని మమేకం చేయడానికి శక్తిమంతమైన చిహ్నాలుగా నిలబడ్డాయి. అదే తరహాలో ఈనాటి 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాన్ని అమృత మహోత్సవంగా సంకేత పరుస్తూ కేంద్ర ప్రభుత్వం దేశ పౌరులందరికీ ఇందులో భాగస్వామ్యాన్ని పంచింది. 2022 స్వాతంత్య్ర దినోత్సవానికి 75 వారాల ముందుగా దండియాత్ర ఉద్యమ ఘటనతో మొదలైన ఈ అమృత మహోత్సవం భారతదేశ చరిత్రలో సుసంపన్నమైనదిగా, చిరస్థాయిగా ఉండిపోతుంది.  

(చదవండి: ఉద్యమ స్ఫూర్తి.. కడప కీర్తి)

మరిన్ని వార్తలు