రాముడు, హ‌నుమంతుడికి మోదీ అప‌ర భ‌క్తుడు

5 Aug, 2020 13:48 IST|Sakshi

అయోధ్య :  రామాల‌యానికి భూమి పూజ జ‌రిగిన ఆగ‌స్టు 5 ను చారిత్ర‌క‌రోజుగా యోగా గురువు బాబా రాందేవ్ అభివ‌ర్ణించారు. త‌ర‌త‌రాలు ఈ రోజును  గ‌ర్వంగా గుర్తుంచుకుంటాయ‌ని అన్నారు. భార‌త్‌లో కొత్త చ‌రిత్ర లిఖించ‌బ‌డింద‌ని, ప్ర‌జ‌లంద‌రూ ఈరోజును ప‌ర‌స్క‌రించుకొని సంబ‌రాలు జ‌రుపుకోవాల‌న్నారు. అయోధ్య‌లో రామ‌మందిర శంకుస్థాప‌న సంద‌ర్భంగా బాబా రాందేవ్ ప్ర‌త్యేక అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..ఆల‌య నిర్మాణంతో దేశంలో రాజ‌రాజ్యానికి నాంది ప‌లికిన‌ట్ల‌య్యింద‌న్నారు. ఈ చారిత్ర‌క ఘ‌ట్టంతో సాంస్కృతిక, ఆర్థిక అస‌మాన‌త‌లు తొలిగిపోతాయ‌ని రామ‌రాజ్యంలో ప్ర‌జ‌లంద‌రూ సంతోషంగా ఉంటార‌న్నారు. రామ రాజ్యం అంటే ఆదర్శవంతమైన పరిపాలన అని రాందేవ్ అన్నారు. (లైవ్‌ అప్‌డేట్స్‌; అయోధ్యలో భూమిపూజ)

రాముడికి, హ‌నుమంతుడికి న‌రేంద్ర‌మోదీ అప‌ర భ‌క్తుడ‌ని, అలాంటి ప్ర‌ధాని మ‌న‌కుండ‌టం ప్ర‌జ‌లందరి అదృష్ట‌మ‌ని అన్నారు.    హిందూ ధ‌ర్మం గ‌ర్వించేలా చేసిన ప్ర‌ధాని మోదీనే అని బాబా రాందేవ్ కొనియాడారు. అత్యంత భ‌ద్ర‌త , కోవిడ్ ప‌రిస్థితుల నేప‌థ్యంలో కేవ‌లం 175 మంది అతిథుల‌ను మాత్ర‌మే ఆహ్వానించారు. అయెధ్య ర‌హ‌దారుల‌కు ఇరువైపులా రామ మందిర న‌మూనా చిత్రాలతో స‌ర్వాంగ సుంద‌రంగా అలంక‌రించారు. అయోధ్య న‌గ‌ర‌మంతా రామ‌నామంతో మార్మోమోగిపోతుంది. (‘భూమి పూజ రాజకీయ కార్యక్రమం కాదు’)


 

మరిన్ని వార్తలు