పో* సినిమాలే కాదు.. టీవీ సీరియల్స్‌లోనూ అశ్లీలతే! సనాతనం అన్ని మతాలది: బాబా రాందేవ్‌

18 Feb, 2023 18:12 IST|Sakshi

పనాజి: టీవీ సీరియల్స్‌, సినిమాల్లో అశ్లీలత, పో* చిత్రాల ప్రభావం.. దేశంలో యువతరంపై తీవ్రంగా ఉంటోందని ప్రముఖ యోగా గురు రామ్‌దేవ్‌ అంటున్నారు. 

ఈరోజుల్లో.. పో* చిత్రాలు ఎక్కువగా నిర్మితం అవుతున్నాయి. సినిమాలు, ఇతర ఎంటర్‌టైన్‌మెంట్‌ మాధ్యమాలు, ఆఖరికి ఇంటిల్లిపాది చూసే టీవీ సీరియళ్లలోనూ అశ్లీలత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ కంటెంట్‌ యువతను ఎక్కడికో తీసుకెళ్తోంది. వాళ్లు వాటితోనే ప్రయాణిస్తున్నారు అని మిరామర్‌ బీచ్‌లో(గోవా)లో జరిగిన మూడు రోజుల యోగా క్యాంప్‌ సందర్భంగా రామ్‌దేవ్‌ ఈ కామెంట్లు చేశారు. అందుకే ఆధ్యాత్మికం, యోగా వైపు మళ్లాలని ఆయన యువతకు సూచించారు.

ఇక ఎటువంటి మందులు తీసుకోకుండా సహజంగా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ప్రజలను మార్గనిర్దేశం చేయడమే తన లక్ష్యమని చెప్పారు బాబా రామ్‌దేవ్‌. సనాతనం అనేది అన్ని మతాలను కలిపే వారధని.. అందుకే దానిని అనుసరించాలని తాను ఎల్లప్పుడూ ప్రజలను కోరుతున్నానని యోగా గురు చెప్పారు. హిందూయిజం, జైనిజం, బుద్ధిజం, సిద్ధలోనే కాదు.. సనాతనం అనేది ఇస్లాం, క్రైస్తవంలోనూ ఉంది. సనాతనం అనేది ఏమాత్రం వివాదాస్పదమైన పదం కాదని అన్నారు. ఏదైనా నిర్దిష్ట మతం లేదంటే రాజకీయ ఎజెండాతో సంబంధం లేదు అని రామ్‌దేవ్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు