ప్ర‌ముఖ క్రీడాకారులు.. డిప్యూటీ డైరెక్టర్లుగా నియామ‌కం

31 Jul, 2020 13:56 IST|Sakshi

చంఢీగ‌డ్ : భారత  రెజ్లర్ బబితా ఫోగాట్, కబడ్డీ క్రీడాకారిణి కవితా దేవిలను క్రీడా, యువజన వ్యవహారాల శాఖ డిప్యూటీ డైరెక్టర్లుగా నియమిస్తూ హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2018  జూలై 29న వెలువ‌డ్డ ఉత్త‌ర్వుల‌కు అథ్లెట్లు ఇద్దరూ దరఖాస్తు చేసుకోగా.. ఇద్దరికీ చోటుకల్పించారు. ప్ర‌భుత్వ ఆదేశాల ప్ర‌కారం నెల‌రోజుల్లోగా ఇద్ద‌రు అథ్లెట్లు సంబంధిత విభాగంలో రిపోర్టు చేయాల‌ని తెలిపారు. ప్ర‌సిద్ధ రెజ్లింగ్ కోచ్ మహావీర్ ఫోగాట్ కుమార్తె  బబితా. ఫోగ‌ట్ సోద‌రీమ‌ణుల జీవితం ఆధారంగా రూపొందించిన బాలీవుడ్ చిత్రం దంగ‌ల్ సూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఫోగాట్ పేరు దేశ వ్యాప్తంగా మారు మ్రోగి పోయింది. (వారికి సాయం చేయండి: విరుష్క)

కొత్త బాధ్య‌త‌ల‌ను చేప‌ట్ట‌డంపై బ‌బితా స్పందిస్తూ.. తన నియామకంపై  సీఎం మనోహర్ లాల్ ఖట్టార్, క్రీడల మంత్రి సందీప్ సింగ్‌లకు ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఒక క్రీడాకారిణిగా ఆట‌గాళ్ల‌కు అవ‌స‌రమైన అన్ని స‌దుపాయాలు ల‌భించేలా కృషి చేస్తాన‌ని తెలిపింది. ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానంగా  భారత మాజీ హాకీ జట్టు కెప్టెన్ క్రీడా మంత్రి సందీప్ సింగ్‌తో క‌లిసి ప‌నిచేయడానికి తాను ఎదురుచూస్తున్న‌ట్లు పేర్కొంంది. ఇక 2019లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బ‌బితా ప‌రాజ‌యం పాలైన సంగ‌తి తెలిసిందే. ఇక ప్ర‌ముక క‌బ‌డ్డీ క్రీడాకారిణి క‌వితాదేవి  2014  ఇంచియాన్ ఆసియా క్రీడల్లో బంగారు ప‌త‌కం సాధించింది. (జాతీయ క్రీడా అవార్డులు ఆలస్యం! )


 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా