శాఖాహార మొసలి బబియా ఇక లేదు

10 Oct, 2022 11:25 IST|Sakshi

కేరళలోని కాసరగోడ్‌ జిల్లాలో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచిని శాఖాహార బబియా అనే మొసలి మరణించింది. ఈ మొసలి కేరళలోని అనంతపుర గ్రామంలోని దేవాలయంలో ప్రధాన ఆకర్షణగా ఉండేది. కేవలం అన్నం మాత్రమే ఆహారంగా తీసుకుని జీవించేది. ఈ మొసలి అనంత ద్మనాభ స్వామి ఆలయం చెరువు మధ్యలో  ఉండేది. 

ఈ ఆలయా చెరువులోకి ఈ మొసలి ఎలా వచ్చిందనేది ఎవరికి తెలియదు. పైగా దానికి బబియా అనే పేరు ఎవరు పెట్టారో కూడా తెలియదు. కానీ అది ఎప్పుడూ క్రూరంగా ప్రవర్తించలేదని ఆ చెరువులో ఉండే చేపలను కూడా తినలేదని ఆ ఆలయ పూజారి చెబుతున్నాడు. ఆ ఆలయ పూజారికి మొసలికి చాలా అవినాభావ సంబంధం ఉంది. రోజు పూజారి  ఆ మొసలికి రెండు సార్లు అన్నాన్ని అందిస్తాడని, ఒక్కోసారి ఆయనే అన్నాన్ని బంతిలా చేసి ఆ మొసలి నోటికి అందిస్తాడని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.

పురాతన ఆలయ సాంప్రదాయానికి అనుగుణంగా పూర్తి శాఖాహార మొసలి అని ఆలయ పూజారి చెబుతున్నాడు. పూరాణాల ప్రకారం తిరువనంతపురంలో ఉన్న అనంతపద్మనాభ స్వామి మూలస్థానం ఇదేనని, ఆయని ఇక్కడే స్థిరపడినట్లు భక్తుల విశ్వసిస్తారు. అదీగాక ఈ బబియా అనే మొసలిని ఆలయాన్ని రక్షించడానికి దేవుడు నియమించిన సంరక్షకురాలని భక్తుల ప్రగాఢంగా నమ్ముతారు.

(చదవండి: మేక మొక్కులకు భక్తులే షాకయ్యారు.. శివయ్య వరమిస్తాడా?.. వీడియో వైరల్‌)

మరిన్ని వార్తలు