వింత శిశువు జననం

23 Apr, 2021 08:04 IST|Sakshi

సాక్షి, బరంపురం (ఒడిశా): నగరంలోని ఎంకేసీజీ మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలో ఓ మహిళ వింత శిశువుకి గురువారం జన్మనిచ్చింది. బట్టకుమరా గ్రామానికి గర్భిణికి ఉదయం పురిటినొప్పులు రావడంతో ఆమెని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో 2.40 కిలోల బరువున్న శిశువుకి ఆమె జన్మనివ్వగా, శిశువు తల పంది తల ఆకారంలోనూ, చర్మంపై పొలుసులు ఉండి అవి ఊడిపోతున్నట్లుగానూ కనిపిస్తోంది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగానే ఉండగా, ఇటువంటి శిశువు ఇంతవరకు బతికి ఉండడం చాలా అరుదు అని వైద్యులు అంటున్నారు. 

చదవండి: నీ ఒంట్లో ఏమైనా స్ప్రింగ్‌ ఉందా ఏంటి!

మరిన్ని వార్తలు