వీడియో: గున్న ఏనుగు చుట్టూ ‘భారీ’ బాడీగార్డులు.. ఓ లుక్కేయండి

23 Jun, 2022 13:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వైరల్‌:  బాడీగార్డులు అంటే.. పెద్ద పెద్ద కండలు వేసుకుని.. అరడుగుల పైన ఉండి టైట్‌ టీ షర్టులు, హాఫ్‌షర్టులు వేసుకునే ఉండాలా?. సెక్యూరిటీ అంటే తుపాకులతో, కర్రలతో కాపలాగా ఉండాలా??. ఒక చిన్ని గున్న ఏనుగు.. జెడ్‌ ఫ్లస్‌ ఫ్లస్‌ ఫ్లస్‌ రేంజ్‌ భద్రత నడుమ వెళ్తుండడం ఎప్పుడైనా చూశారా?. ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌ సుశాంత నంద అప్‌లోడ్‌ చేసిన సరదా వీడియో ఇప్పుడు అలాగే అనిపిస్తోంది. కోయంబత్తూర్‌ సత్యమంగళం అడవుల్లో అప్పుడే పుట్టిన ఓ ఏనుగు గున్నకు ఇలా ఏనుగులు ఎస్కార్టుల్లాగా వెళ్లాయి. రెప్పార్పకుండా కింది వీడియోను చూసేయండి మరి!.

చదవండి: తిండిబోతు ఏనుగులు.. వదిలేస్తే రోజులో 18 గంటలు తింటూనే..

మరిన్ని వార్తలు