పార్కింగ్‌ స్థలం ఉంటేనే ఇక కొత్త వాహనం 

2 Dec, 2020 08:52 IST|Sakshi

సర్కారు కొత్త విధానాలు?

సాక్షి, బెంగళూరు: బెంగళూరులో వాహనం కొనడం ఒకెత్తయితే, దాని పార్కింగ్‌కు స్థలం దొరకడం మరొక ఎత్తు. ట్రాఫిక్‌ రద్దీ, పార్కింగ్‌ స్థలం కొరతతో నగరవాసులు విలవిలలాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ సిటీలో అస్తవ్యస్తంగా ఉన్న పార్కింగ్‌ వ్యవస్థపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇకపై ప్రజలు కొత్తవాహనాలను కొనే ముందు వాటిని పార్కింగ్‌కు సొంత స్థలం ఉందని ప్రమాణపత్రం ఇవ్వాలని తీర్మానించింది. స్మార్ట్‌పార్కింగ్‌ వ్యవస్థను అమలు చేయనుంది.   చదవండి:  (రెడ్‌ అలర్ట్‌: రాష్ట్రానికి బురేవి తుపాన్‌ భయం)

నగరమంతటా పార్కింగ్‌ ఫీజులు   
సీఎం విధానసౌధలో ఉన్నతాధికారులతో పార్కింగ్‌ సమస్యపై చర్చించారు. విధానాల రూపకల్పన కోసం కమిటీని వేశారు. ఎంజీ రోడ్డు, బ్రిగేడ్‌ రోడ్డు మాదిరిగా నగరమంతటా ప్రధాన స్థలాల్లో వాహనాల పార్కింగ్‌కు నిర్ణీత ఫీజులను వసూలు చేయాలని నిర్ణయించారు. ఇళ్ల పక్కన ఉండే ఖాళీ స్థలాలను పార్కింగ్‌ ప్రదేశాలుగా వాడుకోవాలని చర్చించారు. కమిటీ నివేదిక వచ్చాక పార్కింగ్‌ ప్రదేశాలను ఖరారు చేస్తారు.      

మరిన్ని వార్తలు