స్టార్‌ హీరోపై ట్రోలింగ్‌: ‘స్విగ్గీ వాళ్లు నా డబ్బులు రిటర్న్‌ చేయలేదు’

6 Nov, 2021 20:06 IST|Sakshi

కోల్‌కతా: ప్రస్తుతం దేశంలో ఆర్థికమాంద్యం, కోవిడ్‌, ఇంధన ధరల పెంపు, నిరుద్యోగం, వాయు కాలుష్యం వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఓ వైపు విపక్షాలు.. ఆర్థిక, రాజకీయ రంగ నిపుణులు ఈ సమస్యల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓ స్టార్‌హీరో మాత్రం ఫుడ్‌ డెలివరీ యాప్‌ల తీరు సరిగా లేదు.. వాటి మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ.. ఏకంగా ప్రధాని, సీఎంలకు లేఖ రాశాడు. ఇది వైరలవ్వడమే కాక దేశంలో ఇన్ని సమస్యలుండగా.. నీకు ఇంత చిల్లర విషయం దొరికిందా ఫిర్యాదు చేయడానికి అంటూ సదరు నటుడిపై దుమ్ముత్తెపోస్తున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. 

పశ్చిమబెంగాల్‌ సూపర్‌ స్టార్‌ ప్రోసెన్‌జిత్ ఛటర్జీ శనివారం నరేంద్ర మోదీకి రాసిన లేఖ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ లేఖలో స్విగ్గి యాప్‌పై మోదీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫిర్యాదు చేశాడు. లేఖలో ప్రసుత్తం జనాలు ఫుడ్‌ డెలివరీ యాప్‌ల మీద బాగా ఆధారపడుతున్నారు. దీన్ని అలుసుగా చేసుకుని వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని తెలిపాడు ప్రోసెన్‌జిత్‌.
(చదవండి: డెలివరీ బాయ్‌ నిర్వాకం: ‘మీ ఫుడ్‌ని చెత్తలో పడేశాను.. వెళ్లి తెచ్చుకోండి’)

‘‘కొన్ని రోజలు క్రితమే నేను స్విగ్గీలో ఫుడ్‌ ఆర్డర్‌ చేశాను. కానీ వారు నాకు ఆహారం డెలివరీ చేయకుండానే.. ఫుడ్‌ డెలివరీ ఇచ్చినట్లు స్టేటస్‌ పంపించారు. దీని గురించి స్విగ్గి యాప్‌లో ఫిర్యాదు చేసి.. నా డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాను. కానీ వారు నిరాకరించారు. ప్రస్తుతం దేశంలో ఈ సమస్య బాగా పెరుగుతుంది. కనుక గౌరవ ప్రధాని మోదీ, సీఎం మమతా బెనర్జీ తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాను’’ అని ప్రోసెన్‌జిత్‌ లేఖలో పేర్కొన్నాడు. 
(చదవండి: వెలకట్టలేని సెల్యూట్‌.. కోట్లు పెట్టినా దొరకని సంతోషం )

ఈ లెటర్‌ కాస్త వైరల్‌ కావడమే కాక ఓ రేంజ్‌లో ట్రోల్‌ అవుతుంది. ‘‘నువ్వేం హీరోవు నాయనా.. ఓ వైపు దేశంలో ఎన్నో క్లిష్ట  సమస్యలు ఉంటే.. నీ ఈ చెత్త ప్రాబ్లం కోసం ప్రధానికి లేఖ రాస్తావా.. కొంచెం కూడా బుద్ధి లేదా’’ అంటూ ఓ రేంజ్‌లో విమర్శిస్తున్నారు నెటిజనుల.  

చదవండి: 'నేను ప్రధానిగా రాలేదు.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చా'

మరిన్ని వార్తలు