చోక్సీ గర్ల్‌ఫ్రెండ్‌ : మరో ట్విస్టు

10 Jun, 2021 13:43 IST|Sakshi

బార్బరా ఆరోపణలపై  ప్రీతి చోక్సీ స్పందన

మెహుల్‌ చోక్సీకి మరో  ఎదురు దెబ్బ

అక్రమ వలదారుగా ప్రకటించిన డొమినికా

సాక్షి,న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్బీ‌) కుంభకోణం నిందితుడు, డొమినికాలో కోర్టు విచారణని ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. చోక్సీ గర్ల్‌ఫ్రెండ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న బార్బరా జబారికా వ్యాఖ్యలపై చోక్సీ భార్య ప్రీతి చోక్సీ ఘాటుగా స్పందించారు. మెహుల్ తనను తాను రాజ్ అని పరిచయం చేసుకున్నాడనే బార్బరా వాదనను కొట్టి పారేశారు. నిజానిజాలు తెలుసుకోవడానికి సోషల్‌ మీడియా ఉందిగా అని ప్రశ్నించారు.  అదంతా బోగస్‌ అని, బార్బరా ఆరోపణలకు అసలు ఎలాంటి  ప్రామాణికత లేదని  ప్రీతి వెల్లడించారు. 

డొమినికా మీదుగా క్యూబాకు పారిపోయి అక్కడ స్థిరపడాలని చోక్సి పన్నాగం పన్నాడన్న ఆరోపణలను ప్రీతి తీవ్రంగా ఖండించారు. రాజ్‌గా పరిచయం చేసుకున్నాడనే దానిపై మండిపడిన ప్రీతి నిజానికి చిన్న పిల్లలు కూడా ఎవరితోనైనా స్నేహం చేసేటపుడు ఫ్రెండ్స్‌ లిస్ట్‌ను ఇంటర్నెట్‌లో చూస్తున్నారని, లేదా "రివర్స్ గూగుల్ సెర్చ్‌"  సోషల్ మీడియాలో వెతుకుంటాం. ఇందుకు కొన్ని సెకన్ల సమయం చాలు.. ఇది చాలా ఈజీ కూడా అని ప్రీతి గుర్తు చేశారు. చోక్సీ చెప్పింది గుడ్డిగా నమ్మేందుకు, ఏమైనా రాతి యుగంలో బతుకుతున్నామా?! అని  ప్రశ్నించారు. అంతేకాదు వాట్సాప్ సందేశాల కంటెంట్‌ మార్చడం, ఫోటోషాప్ ద్వారా ఫోటోలు మార్ఫింగ్‌ చేయొచ్చు. ఈ నేపథ్యంలో బార్బరా ఆరోపణలకు ఎలాంటి విశ్వసనీయత లేదని తేల్చి చెప్పారు. ఈ విషయలో ఇంత దుమారం రేగుతున్నా..ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది మంది ఫాలోవర్లలో ఒక్కరు కూడా ఆమెకు మద్దతుగా ఎందుకు నిలవలేదని పేర్కొన్నారు. తప్పుడు ప్రకటనలతో తన భర్తపై బురద జల్లే ప్రయత్నం ఇదని, అసలు తను ఎక్కడ ఉంటోంది తదితర వివరాలను వెల్లడించని బార్బరా  వెర్షన్‌ను ఎలా విశ్వసిస్తామని ప్రీతి చోక్సీ  ప్రశ్నించారు.

చోక్సీకి మరో ఎదురుదెబ్బ
ఇదిలా ఉంటే డొమినికా జాతీయ భద్రతా, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ చోక్సీని "నిషేధిత వలసదారు" గా ప్రకటించింది. అక్రమంగా దేశంలో ప్రవేశించినందున నిషేధిత ఇమ్మిగ్రేషన్‌ చట్టం కింద తీసుకోవలసిన చర్యలతో పాటు అతన్ని స్వదేశానికి పంపించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి రేబర్న్ బ్లాక్‌మూర్ ఆదేశించారు.

చదవండి :  క్యూబాకు పారిపోవాలనేది చోక్సి ప్లాన్‌

మరిన్ని వార్తలు