బార్క్, మైసూర్‌లో ఉద్యోగాలు

1 Sep, 2021 20:33 IST|Sakshi

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన మైసూర్‌లోని అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌(బార్క్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 20

► పోస్టుల వివరాలు: డ్రైవర్, పంప్‌ ఆపరేటర్, ఫైర్‌మెన్, సబ్‌ ఆఫీసర్‌.

► అర్హత: హెచ్‌ఎస్‌సీ(10+2) ఉత్తీర్ణులవ్వాలి. డ్రైవింగ్‌ లైసెన్స్, ఫైర్‌ కోర్సుకు సంబంధించిన సర్టిఫికేట్‌ ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం–శారీరక ప్రమాణాలు ఉండాలి.

► వయసు: 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి.

► వేతనం: నెలకు రూ.21,700 నుంచి రూ.35,400 వరకు చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: ఫిజికల్‌ టెస్ట్‌లో అర్హత సాధించిన వారికి రాతపరీక్ష నిర్వహించి ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 15.10.2021

► వెబ్‌సైట్‌: https://recruit.barc.gov.in/barcrecruit/



డీజీసీఏలో 27 కన్సల్టెంట్‌ పోస్టులు

న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వశాఖకు చెందిన డైరెక్టరేట్‌జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ).. ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (చదవండి: నిరుద్యోగులకు అమెజాన్ తీపికబురు!)

► మొత్తం పోస్టుల సంఖ్య: 27

► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు వాలిడ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్స్‌ మెయింటెనెన్స్‌ లైసెన్స్, ఇతర సాంకేతిక నైపుణ్యాలు, సంబంధిత అనుభవం ఉండాలి.

► వేతనం: నెలకు రూ.75,000 చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తును రిక్రూట్‌మెంట్‌ సెక్షన్, డీజీసీఏ, న్యూఢిల్లీ చిరునామకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 03.09.2021

► వెబ్‌సైట్‌: https://www.dgca.gov.in

మరిన్ని వార్తలు