‘12 వారాలు న్యూస్‌ ఛానెల్స్‌ ‌ బ్రాడ్‌కాస్టింగ్‌‌ రేటింగ్‌ నిలిపివేత’

15 Oct, 2020 15:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: హిందీ, ఇంగ్లీష్‌, ప్రాంతీయ న్యూస్‌ ఛానెల్స్‌తో పాటు బిజినెస్‌ న్యూస్‌ ఛానెల్‌ల వ్యూయర్‌షిప్‌ రేటింగ్‌ను ఎప్పటికప్పుడు విడుదల చేసే బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌(బార్క్‌) సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా న్యూస్‌ ఛానెల్‌ల వ్యూయరిషిప్‌ రేటింగ్‌ను పన్నెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. దీంతో ఈ వారం విడుదల చేయాల్సిన న్యూస్‌ ఛానెల్‌ల వ్యక్తిగత రేటింగ్‌ను బార్క్‌ ప్రకటించడం లేదని తెలిపింది. బార్క్‌ తన ప్రకటనలో.. ‘ప్రస్తుతం టెలివిజన్‌, న్యూస్‌ ఛానెల్‌లో జరుగుతున్న అభివృద్ధితో పాటు సంకేతిక లోపాల దృష్ట్యా బార్క్ బోర్డు, సాంకెతిక మండలిని(టెక్‌ కమిటీని) సంప్రదించినట్లు చెప్పింది. ఈ టెక్‌ కామ్‌ రోజువారి ఛానెల్‌ సముచిత డేటాను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ.. ప్రస్తుత బ్రాడ్‌కాస్టింగ్‌ ప్రమాణాల నివేధికను పరీక్షిస్తుంది. రేటింగ్‌ గణాంకాలను మెరుగుపరచడంతో పాటు . ప్యానెల్‌ గృహాలలోకి చొరబడే సంభావ్యత ప్రయత్నాలను కూడా గణనీయంగా దెబ్బతీస్తుంది’ అని పేర్కొంది. అయితే టెక్‌కామ్‌ పర్యవేక్షలో జరిపే ప్రయోగానికి 8 నుంచి 12 వారాల సమయం పడుతుందని, ఈ నేపథ్యంలో టీవీ, న్యూస్‌ ఛానెల్‌ల రేటింగ్‌ను 12 వారాల నిలిపివేస్తున్నట్లు బార్క్‌ తన ప్రకటనలో వివరించింది. (చదవండి: లవ్‌ జిహాద్‌: వివాహాలపై వివాదాస్పద నిర్ణయం)

అలాగే వార్తా ప్రాసారకులకు ప్రాతినిధ్యం వహించే న్యూస్‌ బ్రాడ్‌కాస్ట్‌ర్స్‌ అసోసియేషన్‌(ఎన్‌బీఏ) కూడా బార్క్‌ నిర్ణయాన్ని స్వాగతించింది. ఈ సస్పెన్స్‌ ఖచ్చితమైన రేటింగ్‌‌కు ఇచ్చేందుకు సరైన మార్గంగా ఎన్‌బీఏ ప్రెసిడెంట్‌ రజత్‌ శర్మ అన్నారు. ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ఇటివల బ్రాడ్‌స్టింగ్‌ రేటింగ్స్‌ను ఎప్పటికప్పుడు వెల్లడించే క్రమంలో రేటింగ్‌ ఎజేన్సీకి, ప్రసార వార్త మాధ్యమాలకు అపఖ్యాతిని తెచ్చిపెట్టింది. రేటింగ్‌ డేటాలో హెచ్చుతగ్గులు ఊహించని విధంగా చోటుచేసుకున్నాయన్నారు. అసలు భారత ప్రజలు ఏం చూస్తున్నారో దానిపై ఖచ్చితమైన రేటింగ్‌ ఇవ్వడంలో కూడా తప్పుడు కథనాలు వచ్చాయన్నారు. అలాగే జర్నలిస్టులపై, జర్నలీజం ఆదర్శాలకు విరుద్ధంగా పనిచేసే సంపాదకియ కాల్స్‌ తీసుకోవడంలో కూడా తమ సభ్యులపై ఒత్తిడి తెచ్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకే బార్క్‌ ఈ నిర్ణయం తీసుకుందని, వార్తా ఛానెల్‌ల రేటింగ్‌లను, కంటెంటెంట్‌ను మెరుగుపరచడం కోసమే బార్క్‌ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. (చదవండి: మహా గవర్నర్‌ రీకాల్‌కు సేన డిమాండ్‌)

మరిన్ని వార్తలు