వీడియో: ఫ్రెండ్‌ బర్త్‌డేలో హుషారుగా స్టెప్పులు, అంతలోనే ఒక్కసారిగా..

2 Sep, 2022 21:18 IST|Sakshi

వైరల్‌: మనిషి జీవితం నీటి బుడగలాగా మారిపోయింది. ఎప్పుడు.. ఎలా ముగుస్తుందో చెప్పని పరిస్థితులు నెలకొన్నాయి. మారుతున్న లైఫ్‌ స్టయిల్‌కు తగ్గట్లే రకరకాల రోగాలు.. కొత్త కొత్త వైరస్‌లు మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయ్‌. ముఖ్యంగా సడన్‌ స్ట్రోక్‌లతో ప్రాణాలు పోతున్న ఘటనలు మన కళ్లముందే జరుగుతున్నాయ్‌. తాజాగా అలాంటి ఓ షాకింగ్‌ ఘటన.. వేడుకలో విషాదం నింపింది. 

ప్రభాత్ ప్రేమి (45).. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. గురువారం రాత్రి ఆయన  తన స్నేహితుడు మనీష్ పుట్టినరోజు వేడుకకు హాజరయ్యాడు. ఉత్తర ప్రదేశ్‌ బరేలీ ఓ హోటల్‌లో పార్టీ నిర్వహించారు. మంచి డ్యాన్సర్‌ అయిన ప్రభాత్‌.. హుషారుగా బాలీవుడ్‌ సాంగ్స్‌కు స్టెప్పులేశాడు. అది చూసి అంతా విజిల్స్‌, గోలతో ఆయన్ని ఎంకరేజ్‌ చేశారు. అయితే.. ఉన్నట్లుండి ఆయన ఒక్కసారిగా కిందపడిపోయారు. 

అలా కుప్పకూలిపోయి ఆయన మరణించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో కాస్త వైరల్‌ కావడంతో చాలామంది ఆయనకు సీపీఆర్‌ లాంటి చేసి ఉండాల్సిందన్న అభిప్రాయం కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. అయితే..

కుప్పకూలిన ప్రభాత్‌ దగ్గరకు వెళ్లి పైకి లేపేందుకు ప్రయత్నించారు అంతా. కానీ ఆయనలో చలనం లేదు. పార్టీలో ఉన్న మనీష్‌ మరో స్నేహితుడు డాక్టర్ వినోద్ పగ్రానీ.. ప్రభాత్‌కు సీపీఆర్‌, కార్డియాక్ ప్రెజర్ ఇచ్చినా లాభం లేకుండా పోయింది. చివరకు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే కార్డియక్‌ అరెస్ట్‌తో ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. 

ఇదీ చదవండి:  నిప్పుతో గేమ్స్‌.. బెడిసి కొట్టడంతో చివరకు.. 

మరిన్ని వార్తలు