అధిక ఉద్యోగాలిస్తే  ప్రోత్సాహకాలు: సీఎం

12 Oct, 2021 08:20 IST|Sakshi

శివాజీనగర: రాష్ట్రంలో ఉద్యోగ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు సీఎం బసవరాజ బొమ్మై చెప్పారు. సోమవారం నగరంలోని ప్యాలెస్‌ మైదానంలో పరిశ్రమల, వాణిజ్య శాఖ ద్వారా ఏర్పాటు చేసిన పరిశ్రమల అదాలత్‌ను ప్రారంభించి మాట్లాడారు. విధానం సిద్ధమైందని, త్వరలోనే అమల్లోకి వస్తుందని, ఏ పారిశ్రామికవేత్త అధికంగా ఉద్యోగాలను ఇస్తారో వారికి ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రోత్సాహకాలను ఇస్తుందని తెలిపారు.

దేశంలో కర్ణాటకను పరిశ్రమలకు అనుకూలమైన రాష్ట్రంగా చేయడానికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. మాజీ సీఎం యడియూరప్ప మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో పరిశ్రమల రంగం ముందంజలో ఉందంటే ఇక్కడున్న ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కారణమన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి మురుగేశ్‌ నిరాణి సహా మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు