జైసల్మీర్‌లో దీపావళి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని

14 Nov, 2020 12:19 IST|Sakshi

రాజస్థాన్: సైనికులతో ఉన్నప్పుడే నాకు నిజమైన దీపావళి అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.  ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దేశ సైనికులతో కలిసి  ఆయన దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రధాని మోదీ రాజస్తాన్‌లోని జైసల్మీర్‌కు చేరుకున్నారు. అక్కడి  లొంగ్వాలాలో జరగనున్న ఈ వేడుకల్లో  బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ అస్థానా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ ఎంఎం నరవనే మోదీతో పాటు ఉన్నారు. వీరమరణం పొందిన జవాన్లను  నివాళులు అర్పించిన మోదీ..ప్రజలంతా దీపాలు వెలిగించి దేశాన్ని కాపాడుతున్న సైనిక వీరులకు వందనం చేయాలని పిలుపునిచ్చారు. (భారత్‌లో ప్రపంచ ఆయుర్వేద కేంద్రం)

దేశ రక్షణ కోసం సైనికులు ప్రదర్శిస్తున్న ధైర్య సాహసాలకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవన్నారు.  జవాన్ల కోసం స్వీట్లు, దేశ ప్రజల ప్రేమ తీసుకువచ్చానంటూ మోదీ వ్యాఖ్యానించారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతీ ఏడాది దీపావళి వేడుకలు దైశ సైనికులతో జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. గతేడాది జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో దీపావళి వేడుకల్లో పాల్గొనగా, 2018లో ఉత్తరాఖండ్‌ సరిహద్దు సైనికులతో కలిసి మోదీ దీపావళి పండుగను జరుపుకున్నారు. 2017లోనూ ఉత్తర కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్‌లో  సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.  (కశ్మీర్లో పాక్‌ దుస్సాహసం)

మరిన్ని వార్తలు