ఎస్‌బీఐ కొత్త చైర్మన్‌గా దినేష్ కుమార్

29 Aug, 2020 08:08 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశంలోని అతిపెద్ద బ్యాంకు  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తదుపరి చైర్మన్‌గా దినేష్ కుమార్ ఖారా (56) నియామకం ఖాయమైంది. ఈ మేరకు బ్యాంక్స్ బోర్డు బ్యూరో (బీబీబీ) శుక్రవారం సిఫారసు చేసింది. ఖారా నామినేషన్ ను ఇక ప్రధాని అధ్యక్షతన జరిగే క్యాబినెట్ నియామకాలకమిటీ (ఏసీసీ)ముందు ఉంచనున్నారు. ఈ కమిటీ ఆమోదంతో ఖారా బాధ్యతలను  చేపడతారు. ప్రస్తుత చైర్మన్ రజనీష్ కుమార్ పదవీకాలం ఈ ఏడాది అక్టోబర్ 7తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్  బాధ్యతలను స్వీకరించాల్సి ఉంది. 

నిన్న (శుక్రవారం) విడుదల చేసిన ఒక ప్రకటనలో, బీబీబీ ఎస్‌బీఐ నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లను ఇంటర్వ్యూ  చేసిన ఆ తరువాత ఖారా పేరును తదుపరి  ఛైర్మన్ గా సిఫార్సు చేసినట్లు చెప్పారు. మరో ఎండీ చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును రిజర్వ్‌క్యాండిడేట్‌గా ప్రతిపాదించింది. దీంతో కరోనా సంక్షోభం నేపథ్యంలోరజనీశ్‌ పదవీకాలాన్నిపొడిగించవచ్చన్న ఊహాగానాలకు తెరపడింది. కాగా గ్లోబల్ బ్యాంకింగ్ అండ్ సబ్సిడియరీస్  (జిబి అండ్ ఎస్) విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఢిల్లీలోని ఎఫ్ఎమ్ఎస్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ చేసారు. 1984లో ఎస్‌బీఐ ప్రొబేషనరీ అధికారిగా చేరారు. ముఖ్యంగా ఎస్‌బీఐలో భారతీయ మహిళా బ్యాంకు సహా, ఐదు బ్యాంకుల విలీనంలో ఖారా  ప్రధాన పాత్ర పోషించారు.

మరిన్ని వార్తలు