కాంగ్రెస్‌ నాయకుడి కొడుకు ఫైర్‌..మోదీకి ఊహించని రీతిలో మద్దతు

24 Jan, 2023 20:25 IST|Sakshi

ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వివాదంలో మోదీకి ఊహించని వర్గాల నుంచి పెద్ద సంఖ్యలో మద్దతు లభించింది. అందులో భాగంగా మోదీకి ఓ సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు కొడుకు నుంచి ఆశ్చర్యపరిచే రీతిలో సపోర్టు లభించింది. ఈ మేరకు కేరళ మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోని కుమారుడు అనిల్‌ ఆంటోని ఆ డాక్యుమెంటరీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతీయ సంస్థలపై బ్రాడ్‌కాస్టర్‌ అభిప్రాయాలను ఉంచడం దేశ సార్వభౌమత్వాన్ని అణగదొక్కడం కిందకే వస్తుందంటూ ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు.

మన స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా ఇంకా మన సంస్థలపై పెత్తనం చెలాయించి, సార్వభౌమాధికారిన్ని అణగదొక్కేలా చేసేందుకు అనుమతించకూడదన్నారు. మన గ్రంథాలు ఉపనిషత్తులు, భగవద్గీత చదివితే గనుక సత్యం ఎప్పటికైనా.. బయటకు వస్తుందన్న విషయం తెలుస్తుందన్నారు. పతిక్రలను అణిచివేసి, సంస్థలు నియంత్రించి, ఆఖరికి ఈడీ, సబీఐలు ఉపయోగించకోవచ్చు, కానీ నిజం ఎప్పటికీ నిజమే అని చెప్పారు. అది ప్రకాశవంతంగా ఉంటుందని, దానికి బయటకు వచ్చేసే దుష్ట అలవాటు ఉందని అన్నారు. ప్రజలను ఎన్ని అణివేతలకు గురిచేసి భయబ్రాంతులకు గురిచేసినా.. నిజాన్ని బయటకు రాకుండా ఆపలేమని నొక్కి చెప్పారు.

ఇటీవల భారత జోడో యాత్రలో రాహుల్‌ ఆ డాక్యుమెంటరీని నిరోధించే కేం‍ద్ర ప్రభుత్వ ప్రయత్నాలను ప్రశ్నించిన రోజునే అనుహ్యంగా సీనియర్‌ నాయకుడు కుమారుడు అనిల్‌​ ఆంటోని నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. తన పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీకి విరుద్ధంగా యూటర్న్‌ తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉండగా, ఇప్పటికే కేంద్రం ఆ వివాదాస్పద డాక్యుమెంటరీ లింక్‌లకు సంబంధించిన యూట్యూబ్‌ వీడియోలు, ట్విట్టర్‌ పోస్ట్‌లను తొలగించాలని ఆదేశించింది. అలాగే విదేశీ మంత్రిత్వ శాఖ సైతం నిష్పక్షపాతం లేని వలసవాద మససతత్వానికి నిదర్శనం అంటూ బీబీసీని తిట్టిపోసింది.

(చదవండి: ఫ్రూఫ్‌ అవసరం లేదు! దిగ్విజయ్‌ సింగ్‌ వ్యాఖ్యలపై రాహుల్‌ వివరణ)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు