Judge Retirement Age: సుప్రీం, హైకోర్టు జడ్జీల రిటైర్మెంట్‌ వయస్సు పెంచాలి 

16 Sep, 2022 10:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల రిటైర్మెంట్‌ వయస్సును పెంచాలని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(బీసీఐ) కోరుతోంది. ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రస్తుతం దిగువ కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల పదవీ విరమణ వయస్సు వరుసగా 60, 62, 65 ఏళ్లుగా ఉన్నాయి.

ముఖ్యంగా హైకోర్టులు, సుప్రీంకోర్టు జడ్జీల పదవీ విరమణ వయస్సులను 65, 67 ఏళ్లకు పెంచాలని బీసీఐ కోరుతోంది. వివిధ కమీషన్లు, ఫోరంలకు చైర్‌ పర్సన్లుగా అనుభవజ్ఞులైన న్యాయవాదులను నియమించేందుకు వీలుగా నిబంధనలను సవరించాలని పార్లమెంట్‌ను కోరుతూ తీర్మానించినట్లు వెల్లడించింది. 

(చదవండి: పోలీసులకు రక్షణ కల్పిస్తున్న 'పాములు'!!.. ఎక్కడ.. ఎవరి నుంచి అంటే..)

మరిన్ని వార్తలు