అద్దంలో చూసుకుని ఖంగుతిన్న ఎలుగుబంటి: వీడియో వైరల్‌

16 Aug, 2022 14:54 IST|Sakshi

చిన్నప్పటి కథలలో విని ఉంటాం. జంతువులు తమ ప్రతిబింబాన్ని చూసుకుని దడుచుకుని పారిపోతాయని. గానీ అవి తమను తాము చూసుకుని ఏం చేస్తాయో నిజంగా ఐతే  తెలియదు కదా. ఇప్పడు నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో ద్వారా అవి ఏం చేస్తాయో చూస్తే నవ్వాగదు.

వివరాల్లెకెళ్తే...ఎవరో కొంతమంది ఒక చెట్టుకి పెద్ద అద్దాన్ని కట్టి ఉంచారు. ఇంతలో అటుగా ఒక ఎలుగు బంటి వచ్చింది. అది ఆహారం కోసం అటు ఇటూ చూస్తూ...ఈ అద్దం వైపు చూసింది. అంతే ఒక్కసారిగా అద్దంలో తన ముఖాన్ని అది చూసుకుని కంగారుపడిపోతుంది. ఇంకో ఎలుగుబండి ఉందనుకుని ఒక్కసారిగా పరుగెత్తేందుకు ప్రయత్నిస్తుంది. ఇంతలో అద్దం కాస్త కిందపడిపోతుంది. ఈ ఘటనకు సంబందించిన వీడియోను టైమ్స్‌ నౌ' వార్త సంస్థం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. సరదాగా మీరు కూడా ఓ లుక్కేయండి. 

మరిన్ని వార్తలు