నివాళి సభలో ‘పోకిరీ’ పాటకు బెల్లి డ్యాన్స్‌లు.. నోరెళ్లబెట్టిన బంధువులు.. వీడియో వైరల్‌

15 May, 2022 19:49 IST|Sakshi

Belly Dance.. పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి అంటారు కదా.. ఈ సామెతను న్యాయం చేశారు. ఒకరి చావు మరొకరికి ఆనందం అంటే ఇదేనేమో.. ఎవరైనా ఆనందంలో పెళ్లిలోనో లేక ఏదైనా పార్టీలోనే జోష్‌తో డ్యాన్స్‌ స్టెప్పులు వేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం చనిపోయిన వ్యక్తికి నివాళులు అర్పించిన తర్వాత సంతాప సభలో బెల్లి డ్యాన్స్‌లు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. 

వివరాల ప‍్రకారం.. చనిపోయిన ఓ వ్యక్తికి నివాళి సభ జరుగుతోంది. మరణించిన వ్యక్తిని గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులు సభను ఏర్పాటు చేశారు. ఈ నివాళి సభకు కుటుంబ స‍భ్యులతో పాటు బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు విచ్చేశారు. ఇంతలో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యేలా సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన పోకిరీ(హిందీ రీమేక్‌) సినిమాలోని ఐటెమ్‌ సాంగ్‌ను ప్లే చేశారు. 

ఇంతవరకు బాగానే.. పాట ప్లే అయిన వెంటనే కొందరు యువతులు స్టేజ్‌ మీదకు వచ్చి బెల్లీ డ్యాన్స్‌ స్టెప్పులు వేశారు. దీంతో సభలో ఉన్న వారంతా నోరెళ్లబెట్టారు. సంతాప సభలో ఇదేం పని రా నాయనా అనుకుంటూ ముక్కున వేలేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి కోరిక మేరకు ఇలా వైరటీగా ప్లాన్‌ చేశారా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

A post shared by Meemlogy (@meemlogy)

ఇది కూడా చదవండి: వైరల్‌ చాయ్‌వాలీ ప్రియాంక.. దుకాణం బంద్‌! కారణం ఉందండోయ్‌..

మరిన్ని వార్తలు