మెట్రో​ రైలుకు గ్రీన్‌సిగ్నల్‌!

26 Aug, 2020 20:11 IST|Sakshi

ఆరు నగరాలకు విమాన సేవల పునరుద్ధరణ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్‌ 20 వరకూ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలు కొనసాగుతాయని ప్రకటించారు. సెప్టెంబర్‌ 7, 11, 12 తేదీల్లో బెంగాల్‌ అంతటా సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలవుతుందని వెల్లడించారు. ఇక భౌతిక దూరం, ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తూ మెట్రో రైలు సేవలను పునరుద్ధరిస్తామని చెప్పారు. బుధవారం కేబినెట్‌ సమావేశం అనంతరం మమతా బెనర్జీ మాట్లాడుతూ సెప్టెంబర్‌ 20 వరకూ రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థల మూసివేత కొనసాగుతుందని చెప్పారు. ఆరు కోవిడ్‌-19 హాట్‌స్పాట్‌ రాష్ట్రాల నుంచి విమాన సర్వీసుల పునరుద్ధరణను అనుమతించారు.

సెప్టెంబర్‌ 1 నుంచి ఈ రాష్ట్రాల నుంచి వారానికి మూడు రోజుల పాటు విమాన రాకపోకలను పునరుద్ధరిస్తామని చెప్పారు. కరోనా కట్టడికి ఆగస్ట్‌ 31 వరకూ ఢిల్లీ, ముంబై, చెన్నై, పుణే, నాగపూర్‌, అహ్మదాబాద్‌ నుంచి కోల్‌కతాకు ప్రయాణీకుల విమానాలను పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం నిషేధించింది. కోవిడ్‌-19 మహమ్మారిని నిరోధించేందుకు పీఎం కేర్స్‌ ఫండ్‌ నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపిణీ చేయాలని మమతా బెనర్జీ డిమాండ్‌ చేశారు. జీఎస్టీ బకాయిలను సైతం కేంద్రం చెల్లించడం లేదని అంతకుముందు సోనియా గాంధీతో జరిగిన బీజేపీయేతర సీఎంల సమావేశంలో మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి : ఇప్పుడు కుక్కర్‌ ఖాళీగా ఉండదు!

మరిన్ని వార్తలు