ఆయన భోజనం ఫోటోలకే పరిమితం: మమత

24 Nov, 2020 15:23 IST|Sakshi

బెంగాల్‌లో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు

అమిత్‌షాపై విరుచుకుపడ్డ బెంగాల్‌ సీఎం

కోల్‌కతా: బెంగాల్‌లో కొన్ని సంవత్సరాలుగా అధికార పార్టీ టీఎంసీ, ప్రతిపక్షం బీజేపీ మధ్య రాజకీయాలు రగులుతున్నాయి. రెండు పార్టీలు దూకుడుతో అక్కడి రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. ఇన్ని రోజులుగా బీజేపీ ప్రధాన నాయకులు బెంగాల్‌లో అడుగుపెట్టలేదు అందుకే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు అమిత్‌ షా ఈ రాష్ట్రంలో పర్యటన చేస్తున్నారు. బిహార్‌ విజయంతో బీజేపీ మంచి జోరు మీద ఉంది.

ఇదే అదునుగా చూసుకొని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అమిత్‌ షాపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌ రాష్ట్రంలోని బంకురా జిల్లాలో ఒక గిరిజన పార్టీ కార్యకర్త ఇంట్లో అమిత్‌షా భోజనం చేస్తుండగా తీసిన ఫోటోను ఆయన తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. దీనిపై స్పందించిన మమత తీవ్రంగా విమర్శించారు. బయట నుంచి తెచ్చిన భోజనం తింటూ గిరిజన కార్యకర్త ఇంట్లో తింటున్నట్లు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఉచిత రేషన్‌ పంపిణీ జూన్‌ వరకు ఇచ్చామని దానిని ఇంకా పెంచుతామని మమత ప్రకటించారు. అమిత్‌ షా రాకతో బెంగాల్‌ రాజకీయాలు కొత్త మలుపులు తిరగనున్నాయి. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్‌లో వచ్చే ఏడాది ఏప్రిల్‌ మే మధ్య ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తాయి.

ఎలా అయిన బెంగాల్‌లో మకాం వెయ్యాలని బీజేపీ చూస్తోంది. అందుకే ఇప్పటి నుంచే పర్యటనల పేరుతో ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది. వారికి శుభ సూచికంగా మమత శిబిరంలో చీలికలు మొదలైనట్లు కనిపిస్తుంది. బీజేపీ బలం పెంచుకోవడానికి ఇదే మంచి సమయం అని భావించి అమిత్‌ షాను రంగంలోకి దించింది. కానీ ఈ పర్యటనలో స్వలాభం ఉందని మమతఎద్దేవా చేయడంతో ప్రజలలో కొంతమేర వ్యతిరేకత వచ్చినట్లు కనిపిస్తుంది. (గ్రేటర్‌ హైదరాబాద్‌ పోరు.. రంగంలోకి అమిత్‌ షా)

మరిన్ని వార్తలు