ఒక్క రూపాయి డాక్టర్‌ సుషోవన్‌ ఇకలేరు

27 Jul, 2022 06:32 IST|Sakshi

కోల్‌కతా: ఒక్క రూపాయి డాక్టర్‌గా పేరు గడించిన బెంగాల్‌ వైద్యుడు సుషోవన్‌ బంధోపాధ్యాయ(84) మంగళవారం కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. కిడ్నీ సంబంధ అనారోగ్య సమస్యలతో ఆయన రెండేళ్లుగా ఇబ్బంది పడుతున్నారు. ఫీజుగా ఒక్క రూపాయి మాత్రమే తీసుకునే ఈ వైద్యుడిని అంతా ఏక్‌ టాకర్‌ డాక్టర్‌(ఒక్క రూపాయి డాక్టర్‌)అని బెంగాల్‌లో పిలుచుకునేవారు.

ఒక పర్యాయం ఎమ్మెల్యే కూడా అయిన ఈయన వైద్య వృత్తిలో 60 ఏళ్లపాటు సేవలందించారు. 2020లో ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. అదే ఏడాది ఆయన్ను అత్యధిక సంఖ్యలో రోగులకు చికిత్స అందించిన వైద్యుడిగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లో చోటుదక్కింది. సుషోవన్‌ మృతి పట్ల ప్రధాని మోదీ, సీఎం మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు. 

మరిన్ని వార్తలు