దీదీని కలిసిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌

2 Mar, 2021 13:28 IST|Sakshi

కోల్‌కతా: సెక్యులర్‌ పార్టీల మధ్య ఐక్యతకోసం  ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్‌ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కి ఓటు వేయాలని, పశ్చిమబెంగాల్‌లోని బీహార్‌ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర సెక్రటేరియట్‌లో దీదీని కలిసిన తరువాత, బెంగాల్‌లో బీజేపీని అడ్డుకోవ డమే తమ పార్టీ ప్రథమ ప్రాధాన్యత అని ప్రకటిం చారు. రాబోయే ఎన్నికలు ‘‘ఆదర్శాలు, విలువ లను కాపాడుకునేందుకే’’నని తేజస్వి చెప్పారు. ‘‘మా పార్టీ మమతా బెనర్జీకి సంపూర్ణ మద్దతు తెలుపుతోంది’’ అని ఆయన స్పష్టం చేశారు. 

ఏఐసీసీ పరిశీలకులు..
పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల నేపథ్యంలో ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ(ఏఐసీసీ) 28 మంది పరిశీలకులను నియమించినట్టు ఓ సీనియర్‌ నాయకులు తెలిపారు. 

8 విడతలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకి..
పశ్చిమబెంగాల్‌లో 8 విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ, న్యాయవాది ఎంఎల్‌.శర్మ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. పశ్చిమ బెంగాల్‌లో 8 విడతలుగా ఎన్నికలు జరపడం  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, ఆర్టికల్‌ 21కి వ్యతిరేకమని, 8 దఫాల ఎన్నికల నిర్వహణను నిలిపేవేయాని కోరారు. 

మరిన్ని వార్తలు