సీబీఐ, ఈడీపై పశ్చిమ బెంగాల్‌ స్పీకర్‌ ఆగ్రహం

14 Sep, 2021 11:37 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాష్టంలోని శాసన సభ్యులపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు చార్జిషీట్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పీకర్‌ బీమన్‌ బాంద్యోపాధ్యాయ మీరు నా అనుమతి లేకుండా ఎలా చార్జిషీట్‌ దాఖలు చేశారంటూ సీబీఐ, ఈడీ అధికారులను ప్రశ్నించారు.

(చదవడండి: కూతురు పుట్టిందని.. పానీపూరి వ్యాపారి గొప్పతనం..)

ఈ క్రమంలో బాంద్యోపాధ్యాయ  సెప్టెంబర్‌ 22న  సీనియర్‌ సీబీఐ, ఈడీ అధికారులను అసెంబ్లీకి హాజరు కావాలంటూ...సమన్లు జారీ చేశానని తెలిపారు. ఈ మేరకు  ముందస్తుగా సమాచారం గానీ , అనుమతి గానీ లేకుండా ఎందుకు చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు.

అధికార తృణమాల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు పోంజీ స్కాం, నారద స్టింగ్‌ ఆపరేషన్‌లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారిపై దర్యాప్తు సంస్థలు చార్జిషీట్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.(చదవండి: దారుణం: కూతురు ప్రేమించిన యువకునిపై సుత్తితో దాడి)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు