త్వరలో ఎలెక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులు

24 Feb, 2023 07:01 IST|Sakshi

సాక్షి బెంగళూరు: బెంగళూరు నగర వాసులకు అతి త్వరలో డబుల్‌ డెక్కర్‌ బస్సుల్లో ప్రయాణించే అనుభవం రానుంది. ఇవన్నీ ఎలెక్ట్రిక్‌ బస్సులే కానున్నాయి. ఓ ప్రముఖ సంస్థతో బస్సుల కొనుగోలుకు బీఎంటీసీ ఒప్పందం చేసుకుంది. తొలుత ఐదు డబుల్‌ డెక్కర్‌ బస్సులకు రూ. 10 కోట్లు బీఎంటీసీ చెల్లించనుంది. తొలి బస్సు మార్చిలో, మరో నాలుగు బస్సులు ఏప్రిల్‌లో వస్తాయి. ఇందులో ఏసీ సహా పలు ఆధునిక వసతులు ఉంటాయని బీఎంటీసీ వర్గాలు తెలిపాయి.  

మొదటి ఏసీ డబుల్‌ డెక్కర్‌ బస్సు హెబ్బాల నుంచి సిల్క్‌ బోర్డు మార్గంలో ప్రయాణించనుంది. వోల్వో వజ్ర బస్సులో చెల్లించే టికెట్‌ చార్జీలే ఈ బస్సులోనూ ఉండనున్నాయి.  ఒక్కసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే సుమారు 250 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఈ బస్సుకు ముందు భాగం, వెనుక భాగంలో తలుపులు ఉంటాయి. 65 మంది ప్రయాణించవచ్చు.

మరిన్ని వార్తలు