గోవాలో స్టార్టప్‌ సీఈఓ దారుణం.. కన్న కొడుకునే హత్య..

9 Jan, 2024 10:27 IST|Sakshi

పనాజీ: బెంగళూరులో ఓ స్టార్టప్‌ కంపెనీ నిర్వహిస్తున్న మహిళా సీఈఓ గోవాలో దారుణానికి ఒడిగట్టింది. తన నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసి మృతదేహాన్ని కర్ణాటక వరకు తీసుకువెళ్లింది. బెంగళూరులో ఆర్టిఫిషియల్‌ ఇంటెల్సిజెన్స్‌కు సంబంధించిన మైండ్‌ఫుల్‌ ఏఐ ల్యాబ్‌ అనే స్టార్టప్‌ కంపెనీకి సుచనా సేథ్‌ సీఈఓగా ఉ‍న్నారు.అయితే ఆమె గోవాలోని ఓ అపార్టుమెంట్‌ భవనంలో తన నాలుగెళ్ల కుమారుడిని చంపినట్లు తెలుస్తోంది.

తర్వాత ఆమె తన కొడుకు మృతదేహాన్ని బ్యాగ్‌లో మూటకట్టి టాక్సీలో కర్ణాటకకు తీసుకువెళ్లింది. మంగళవారం జరిగిన ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేశారు. టాక్సీలో ఉ‍న్న బాలుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను ఆరెస్ట్‌ చేసిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బెంగళూరు చెందిన మహిళ.. గోవాలో తన కొడుకును హత్య చేయడానికి గల కారణాలపై లోతుగా విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. 

చదవండి: రూ.45 వేలకోట్లతో రివర్‌క్రూజ్‌ టూరిజం.. ఏం చేస్తారో తెలుసా..

>
మరిన్ని వార్తలు