ఈ యాప్‌ యూజర్లకు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు ఫ్రీ

10 May, 2021 18:05 IST|Sakshi

బెంగళూరు: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలైనప్పటి నుంచి భారత ప్రజలు ఈ వైరస్‌ దెబ్బకు అల్లాడిపోతున్నారు. ఆరోగ్యపరంగానే ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలువురు సెలబ్రిటీలు, సంస్థలు, అంతేందుకు సామాన్యులు సైతం తమకు తోచిన విధంగా కరోనా బాధితులకు సాయపడుతున్నారు. ఈ నేప‌థ్యంలో రైడింగ్ యాప్ ఓలా ఔదార్యం చాటుకుంది. త‌మ యూజ‌ర్ల ముంగిట‌కు ఆక్సిజ‌న్కాన్సన్‌ట్రేట‌ర్ల‌ను ఉచితంగా అందించాలని నిర్ణయించుకుంది.

మా యూజర్లకు ఫ్రీగా ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు ప్రతీ రోజు పెరగడం, అందులో ఎక్కువ మంది ఆక్సిజన్‌ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. కొందరికి సకాలంలో ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కూడా విడిచారు. దీంతో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లకు డిమాండ్‌ పెరిగింది. ఈ కారణంగా ఓలా సంస్థ తమ యూజర్లకు ఆక్సిజ‌న్ కాన్సన్‌ట్రేట‌ర్ల‌ను  ఉచితంగా అందించడానికి ముందుకువచ్చింది. ఇందుకు చేయాల్సిందల్లా అవ‌స‌ర‌మైన వారి క‌నీస వివ‌రాలు ఓలా యాప్‌లో నింపాల్సి ఉంటుంది. తరువాత అవసరమైన వారి ఇంటి ముందుకే ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను ఉచితంగా తీసుకునేలా ఓలా ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమాన్ని గివ్ ఇండియాతో భాగ‌స్వామ్యం ద్వారా ఓలా ఫౌండేష‌న్ చేయనుంది. 
ఆక్సిజ‌న్ కాన్సన్‌ట్రేట‌ర్ల‌కు, వాటి ర‌వాణా చార్జీల కింద ఓలా త‌మ యూజ‌ర్ల నుంచి ఎలాంటి మొత్తం వ‌సూలు చేయ‌దు. ప్రారంభంగా 500 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను ఈ వారం నుంచి బెంగళూరు నగరంలో ప్రారంభించనుంది. రాబోయే వారాల్లో 10,000 వరకు దేశవ్యాప్తంగా వీటి సరఫరా జరిగేలా అమ‌లు చేస్తామ‌ని ఓలా స‌హ వ్య‌వస్ధాప‌కులు భవీష్ అగ‌ర్వాల్ వెల్ల‌డించారు. అసాధార‌ణ ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల‌కు సాయం చేసేందుకు తాము ఓ2ఫ‌ర్ఇండియా కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. 

( చదవండి: మద్యం ప్రియులకు శుభవార్త.. ఇకపై హోం డెలివరీ )

మరిన్ని వార్తలు