డ్రగ్స్, మద్యం వల్ల అధిక ఆత్మహత్యలు.. ఆ రాష్ట్రాలే టాప్‌!

27 Jun, 2022 18:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బనశంకరి(బెంగళూరు): మత్తు వల్ల కిక్‌ రావడం మాటేమో కానీ జీవితమే ధ్వంసమవుతోంది. దేశంలో ఏడాదికి సరాసరి 8,500 డ్రగ్స్, మద్యం వ్యసనపరులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వీరిలో యువతే అధికం. పేదరికం, నిరుద్యోగం, కుటుంబ కష్టాలు వంటివాటి కంటే డ్రగ్స్, మద్యమే ఎక్కువ ప్రాణాలను బలిగొంటున్నాయి. 

ఏ సమస్యతో ఎంత మంది?  
ప్రేమ విషయంలో 4.5 శాతం మంది, వైవాహిక ఇబ్బందులతో 5.5 శాతం మంది బలవుతున్నారు. 5.6 శాతం మంది మత్తు, మద్యం వల్ల ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. డ్రగ్స్‌ ఆత్మహత్యల్లో 6,745 మందితో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, కర్ణాటక 3,840 మందితో రెండో స్థానంలో నిలవడం గమనార్హం. తమిళనాడు 3,452 మందితో మూడోస్థానంలో ఉంది.

మూడేళ్లలో 3,840 మంది
కర్ణాటకలో గత మూడేళ్లలో మొత్తం 35,099 ఆత్మహత్య కేసులు నమోదు కాగా ఇందులో 3,840 మంది మత్తు, మద్యానికి బానిపై ప్రాణాలు తీసుకున్నట్లు కేంద్రప్రభుత్వం తమ నివేదికలో వెల్లడించింది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో ఏటేటా ఆత్మహత్యలు పెరుగుతున్నాయని అందులో హెచ్చరించింది.

చదవండి: అదృష్టవంతుడు.. మృత్యువు అంచుల వరకు వెళ్లి వచ్చాడు!


  

మరిన్ని వార్తలు