జనవరి 26 నుంచి ముక్కుతో నేరుగా తీసుకునే వ్యాక్సిన్‌ ప్రారంభం

21 Jan, 2023 21:36 IST|Sakshi

స్వదేశీ వ్యాక్సిన్‌ తయారీ సంస్థ భారత్‌ బయోటక్‌ తోలిసారిగా జనవరి 26 నుంచి ముక్కుతో నేరుగా తీసుకునే ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఆ కంపెనీ చైర్మన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణ ఎల్లా శనివారం తెలిపారు. మౌలానా ఆజాద​ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో నిర్వహించిన ఐఐఎస్‌ఎఫ్‌ ఫేస్‌ టు ఫేస్‌ విత్‌ న్యూ ఫ్రాంటియర్స్‌ ఇన్‌ సైన్స్‌ విభాగంలో పాల్గొన్న కృష్ణ ముక్కుతో నేరుగా తీసుకునే ఈవ్యాక్సిన్‌ని రిపబ్లిక్‌ డే రోజున అధికారికంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

అంతేగాదు ఈ ఇంట్రానాసల్‌ కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ను ప్రభుత్వానికి ఒక్కో వ్యాక్సిన్‌కి రూ. 325లకి, ప్రైవేట్‌ కేంద్రాలకి రూ. 800లకి విక్రయించనున్నట్లు పేర్కొంది. అలాగే ఆయన బోఫాల్‌లో జరిగి ఇండియా ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివల్‌లో విద్యార్థులతో ఇంటరాక్ట్‌ అయ్యి పశువులలో వచ్చే లంపి ప్రోవాక్ఇండ్‌కు ‍సంబంధించిన వ్యాక్సిన్‌ను కూడా వచ్చే నెలలో ప్రారంభించే అవకాశం ఉందని చెప్పారు. 

(చదవండి: అండమాన్‌లో 21 దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు)

మరిన్ని వార్తలు