కోవాగ్జిన్‌ సామర్థ్యం 77.8 శాతం 

23 Jun, 2021 08:29 IST|Sakshi

న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన కోవిడ్‌–19 టీకా కోవాగ్జిన్‌ సామర్థ్యం 77.8 శాతంగా తేలింది. మూడో దశ ప్రయోగాలను 25,800 మందిపై చేసిన సంస్థ తన డేటాను డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి కోసం పంపింది. ఈ డేటాను సమీక్షించిన  కోవిడ్‌–19 సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ (ఎస్‌ఈసీ) దానికి ఆమోదం తెలిపినట్టు మంగళవారం డీసీజీఐ వర్గాలు వెల్లడించాయి.

కొవాగ్జిన్‌ సామర్థ్యాన్ని ఆమోదించిన ఎస్‌ఈసీ తన సిఫారసులను డీసీజీఐకి పంపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ అనుమతి జాబితా (ఈయూఎల్‌)లో కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను చేర్చడానికి ఎప్పట్నుంచో భారత్‌ బయోటెక్‌ సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ టీకా సామర్థ్యాన్ని పరిశీలించి అనుమతులు ఇవ్వడానికి ఈ నెలæ 23న డబ్ల్యూహెచ్‌ఓ సమావేశం కానుంది. ఈ సమావేశానికి సంస్థ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇదే సమయంలో మూడో దశ ప్రయోగాల డేటాకు నిపుణుల కమిటీ అనుమతి లభించడం భారత్‌ బయోటెక్‌కు ఊరట కలిగించే అంశం.

చదవండి: సహకారంతోనే సంస్కరణలు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు