భారత్‌ జోడో యాత్రలో అరుదైన దృశ్యం.. సోనియా షూ లేస్‌ కట్టిన రాహుల్‌

6 Oct, 2022 15:42 IST|Sakshi

మాండ్యా: దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. సుదీర్ఘ కాలం తర్వాత సోనియా గాంధీ పబ్లిక్‌ ఈవెంట్‌కు హాజరైన సంగతి తెలిసిందే. కర్ణాటకలో ఆమె తనయుడు రాహుల్‌తో పాటు యాత్రలో పాల్గొని పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ క్రమంలో భారత్‌ జోడో యాత్రలో అరుదైన సంఘటన జరిగింది. తన తల్లిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు రాహుల్‌ గాంధీ. పాదయాత్రలో పాల్గొన్న సోనియా గాంధీ షూ లేస్‌ ఊడిపోవటంతో.. స్వయంగా రాహుల్‌ గాంధీనే సరి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. 

తన తల్లి షూ లేస్‌ కడుతున్న రాహుల్‌ గాంధీ ఫోటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది కాంగ్రెస్‌ పార్టీ. తల్లి అంటూ క్యాప్షన్‌ ఇచ‍్చింది. షూ లేస్‌ సరిచేసిన తర్వాత పాదయాత్రను కొనసాగించారు నేతలు. సోనియాతో పాటు స్థానిక మహిళా ఎమ్మెల్యేలు అంజలి నింబాల్కర్‌, రూపకళ, లక్ష‍్మీ హెబ్బాల్కర్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ‍్యక్షుడు డీకే శివకుమార్‌, మాజీ సీఎం సిద్ధ రామయ్యలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: తనయుడి వెంట.. భారత్‌ జోడో యాత్రలో సోనియా గాంధీ

మరిన్ని వార్తలు