బెల్, ఘజియాబాద్‌లో 80 డిప్లొమా అప్రెంటిస్‌లు

1 Nov, 2021 19:18 IST|Sakshi

ఘజియాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం ఖాళీల సంఖ్య: 80

► ఖాళీల వివరాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్‌–20, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌–20, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌–20, మోడర్న్‌ ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ సెక్రటేరియల్‌ ప్రాక్టీస్‌–20.

► అర్హత: 30.11.2018 తర్వాత సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

► వయసు: 30.11.2021 నాటికి 23ఏళ్లు మించకుండా ఉండాలి.

► ఎంపిక విధానం: ఇంజనీరింగ్‌ డిప్లొమాలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► దర ఖాస్తులకు చివరి తేది: 15.11.2021

► వెబ్‌సైట్‌: www.bel-india.in


బెల్, చెన్నైలో 73 అప్రెంటిస్‌లు

చెన్నైలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌).. 2021–22 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం ఖాళీల సంఖ్య: 73

► ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు–63, టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌లు–10.

► గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్‌. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020, 2021లలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులు. స్టయిపెండ్‌: నెలకు రూ.11,110 చెల్లిస్తారు.

► టెక్నీషియన్‌(డిప్లొమా)అప్రెంటిస్‌లు:విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్‌. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020, 2021లలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు. స్టయిపెండ్‌: నెలకు రూ.10,400 చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: డిప్లొమా, బీఈ/బీటెక్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► నాట్స్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 10.11.2021

► బెల్‌ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 25.11.2021

► వెబ్‌సైట్‌: www.mhrdnats.gov.in

మరిన్ని వార్తలు