‘ఢిల్లీలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు ఆప్‌దే’

17 May, 2022 09:10 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై సీఎం కేజ్రీవాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి 63 లక్షల మందిని నిరాశ్రయులను చేస్తాయని మండిపడ్డారు. ‘‘బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తోంది. ఢిల్లీలో 80 శాతం నిర్మాణాలు అక్రమణలే అని చెప్పవచ్చు. అలాగని 80 శాతం నగరాన్ని ధ్వంస చేస్తారా?’’ అని ప్రశ్నించారు. ఢిల్లీలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు ఆప్‌దేనని ధీమా వ్యక్తం చేశారు.
చదవండి: ఏమైంది ఈ నగరానికి.. రోడ్లపై హల్‌చల్‌ చేస్తున్న విద్యార్థులు

మరిన్ని వార్తలు