మిత్రపక్షానికి పెద్దపీట వేసిన నితీశ్‌

9 Feb, 2021 16:06 IST|Sakshi

మిత్రపక్షం బీజేపీకి పెద్దపీట

పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు

పాట్నా: ఎన్నికల్లో గెలిచిన అనంతరం కొద్దిమందితో మంత్రులు, ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయగా తాజాగా కొత్తగా 17 మంత్రులుగా నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో వారితో గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించారు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ తన పార్టీతో పాటు బీజేపీకి ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఇరు పార్టీల ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. 

బిహార్‌ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ మంగళవారం జరిగింది. కొత్త‌గా 17 మంది మంత్రులుగా గ‌వ‌ర్న‌ర్ ఫాగూ చౌహాన్ ప్ర‌మాణం చేయించారు.  కొత్తగా మంత్రులుగా నియమితులైన వారిలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అధికార ప్రతినిధి స‌హ‌న‌వాజ్ హుస్సేన్ ఉన్నారు. ఆయన గ‌త నెల‌లో మండ‌లికి ఎన్నిక‌వడంతో ఇవాళ మంత్రిగా ప్ర‌మాణస్వీకారం చేశారు. కొత్తగా మంత్రులైన వారిలో జేడీయూ నేత‌లు సంజ‌య్ కుమార్ జా, శ్రావ‌ణ్ కుమార్‌, లేసి సింగ్‌, బీజేపీకి చెందిన మ‌ద‌న్ సాహ‌ని, ప్ర‌మోద్ కుమార్‌ ఉన్నారు. బీహార్ అసెంబ్లీలో 36 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు నితీశ్ బృందంలో 13 మంది మాత్ర‌మే అక్క‌డ మంత్రులుగా ఉండగా తాజాగా 17 మంది నియమితులవడంతో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పడింది.

మరిన్ని వార్తలు