ప్రధాని పదవిపై వ్యామోహం లేదు.. తేల్చేసిన నితీశ్‌ కుమార్‌

5 Sep, 2022 21:28 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎన్డీయే కూటమి నుంచి వైదొలగి.. ప్రాంతీయ పార్టీలతో పాత కూటమి ద్వారా తిరిగి అధికారం నిలబెట్టుకున్నారు బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌. ఈ క్రమంలో.. జాతీయ రాజకీయాల మీద ఆసక్తితోనే నితీశ్‌ కూటమిని వీడారని, ప్రధాని రేసులో నిలవాలని ఆశపడుతున్నారని బీజేపీ ఆరోపణలు గుప్పించింది. 

ఈ క్రమంలో ఈ ఆరోపణపై ఇవాళ నితీశ్‌ కుమార్‌ స్పందించారు. ఢిల్లీలో నేడు కాంగ్రెస్‌ కీలక నేత రాహుల్‌ గాంధీతో ఆయన భేటీ అయ్యి.. దేశరాజకీయాలపై చర్చించారు. అనంతరం నితీశ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రాంతీయ పార్టీలను బలహీనపర్చాలనే ప్రయత్నం జరుగుతోంది. నా ప్రయత్నమల్లా.. సార్వత్రిక ఎన్నికలనాటికి విపక్షాలను ఒక్కటి చేయడమే. అంతేగానీ.. ప్రధాని పదవిపై నాకు వ్యామోహం లేదు. నన్ను ప్రధాని అభ్యర్థిగా విపక్షాలు నిలబెట్టాలనే ఉద్దేశ్యం నాకు ఏమాత్రం లేదు’’ అని స్పష్టం చేశారాయన. 

ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న ఈ జేడీయూ నేత.. ఎన్సీపీ శరద్‌ పవార్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి.. ఆమ్‌ ఆద్మీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌, జనతా దల్‌ సెక్యూలర్‌ చీఫ్‌ హెచ్‌డీ కుమార్‌స్వామి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌.. మరికొందరితో భేటీ అయ్యే అవశాలున్నాయి.

ఇదీ చదవండి: ప్రధాని మోదీ తర్వాతి టార్గెట్‌ రైతుల భూములే!

మరిన్ని వార్తలు