‘2014లో మాదిరిగా 2024లో గెలుస్తారా?’.. ప్రధాని మోదీకి నితీశ్‌ సవాల్‌!

10 Aug, 2022 16:38 IST|Sakshi

పాట్నా: బిహార్‌ ముఖ్యమంత్రిగా 8వ సారి ప్రమాణ స్వీకారం చేశారు నితీశ్‌ కుమార్‌. బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఆర్‌జేడీ, కాంగ్రెస్‌ సహా పలు పార్టీలతో కలిసి ప్రభుత‍్వాన్ని ఏర్పాటు చేశారు. ఎన్డీయే వర్గానికి విపక్ష నేతగా మారిన ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. 2014లో గెలుపొందిన ప్రధాని మోదీ.. 2024 ఎన్నికల్లో గెలుపొందటంపై ఆందోళనపడాలన్నారు. 2014 మాదిరిగా 2024లో గెలుస్తారా? అని ప్రశ్నించారు. 

‘బీజేపీని వీడాలని పార్టీ మొత్తం కలిసి తీసుకున్న నిర్ణయం. 2024 వరకు నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్లు ఏం కావాలో చెప్పగలరు. కానీ, 2014 ఏడాదిలో జీవించలేను. 2014లో అధికారంలోకి వచ్చిన వారు.. 2024లోనూ విజయం సాధిస్తారా? 2024 ఎన్నికల్లో విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని కోరుకుంటున్నా.  2020లో ముఖ్యమంత్రిగా ఉండాలనుకోలేదు. ఒత్తడి చేసి సీఎంను చేశారు. అందుకే మీతో మాట్లాడలేకపోయాను. 2015లో మాకు ఎన్ని సీట్లు వచ్చాయి. అదే బీజేపీతో కలిసి ఉండటం వల్ల 2020లో ఎన్ని తగ్గాయి.’ అని పేర్కొన్నారు నితీశ్‌. మరోవైపు.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ఉండే అంశాన్ని తోసిపుచ్చారు నితీశ్‌.

ఇదీ చదవండి: బీహార్‌ సీఎంగా ఎనిమిదో సారి నితీశ్‌ ప్రమాణం.. డిప్యూటీగా ఆర్జేడీ నేత తేజస్వి

మరిన్ని వార్తలు