బిహార్‌ మాజీ సీఎం సదానంద్ సింగ్ కన్నుమూత

8 Sep, 2021 11:24 IST|Sakshi

పట్నా: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత సదానంద్‌ సింగ్‌ కన్నుమూశారు. ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా బిహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మదన్ మోహన్.. సదానంద్‌ మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందించారు. ‘బిహార్‌కు చెందిన ప్రముఖ నేత, కాంగ్రెస్ యోధుడు సదానంద్ సింగ్ ఈరోజు కన్నుమూశారు. ఆయన మృతితో ఒక రాజకీయ శకం ముగిసింది. మీ నవ్వుతున్న ముఖం ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ట్వీట్‌ చేశారు.

కాగా, సదానంద్ సింగ్ కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ప్రస్తుతం పట్నాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, ఈరోజు ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. బిహార్ ప్రతిపక్ష నేత తేజశ్వి యాదవ్ సదానంద్ సింగ్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
చదవండి: బీజేపీ ఎంపీ అర్జున్‌ సింగ్‌ నివాసం వద్ద బాంబు పేలుడు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు