క్రేజీ లవ్‌: గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం మొత్తం గ్రామానికే కరెంట్‌ లేకుండా చేశాడు

11 May, 2022 15:49 IST|Sakshi

పాట్నా: ప్రేమలో ఉన్నప్పుడూ ప్రేమికులు రకరకాల వెర్రి పనులు చేస్తుంటారు. అయితే ఒక్కోసారి ప్రమాదకరంగా కూడా ఉంటాయి. కొంతమంది ఏకంగా తమ ప్రేమ కోసం ఇతరులను ఇబ్బంది పెట్టేలా పిచ్చి పనులు చేస్తుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి తన గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం ఒక గ్రామానికి కరెంట్‌ లేకుండా చేశాడు. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది.

వివారాల్లోకెళ్తే....బిహార్‌లోని పూర్నియ జిల్లాలోని గణేశ్‌పూర్‌ గ్రామంలోని ప్రజలు తరుచు కరెంట్‌ కోతలతో బాధపడుతున్నారు. ఐతే తమ చుట్టుపక్కల గ్రామాల వాళ్లకి ఇలాంటి సమస్య లేదు మా గ్రామానికి మాత్రమే ఏంటీ ? దుస్థితి అని ఆందోళన చెందారు. దీంతో ఆ గ్రామస్తులంతా ఎలాగైన ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా గ్రామంలోని ప్రజలంతా కలిసి నిఘా పెట్టడం మొదలు పెట్టారు. ఇంతకీ ఇదంతా చేస్తోంది ఆ ఊరి ఎలక్ట్రీషియన్‌ అని తెలుసుకుని ప్రజలంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

అదీ కూడా కేవలం తన  గర్ల్‌ఫ్రెండ్‌ని చీకటిలో కలిసేందు కోసం మొత్తం గ్రామంలో విద్యుత్‌ సరఫరా నిలిపేస్తున్నాడని తెలుసుకుని ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. దీంతో గ్రామస్తులంతా పథకం వేసి మరీ ఆ ప్రేమికులిద్దరిని పట్టుకోవడమే కాకుండా ఆ ఎలక్ట్రీషియన్‌ని చితకొట్టి మరీ గ్రామంలో ఊరేగించారు. అంతేకాదు ఈ సమస్య మళ్లీ తలెత్తకుండా ఉండేలా ఆ ఊరిలోని గ్రామస్తులు, సర్పంచ్‌, ఇతర గ్రామ కౌన్సిల్‌ సభ్యుల సమక్షంలోనే ఆ ప్రేమికులిద్దరికి వివాహం చేశారు. ఐతే ఆ గ్రామస్తులు ఆ ఎలక్ట్రీషియన్‌ పై ఎలాంటి కేసు పెట్టలేదని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

(చదవండి: వీడియో: ఎదురుగా భారీ మొసలి.. అడుగు ముందుకు పడ్డా చావే! ఎందుకలాగంటే..)

మరిన్ని వార్తలు