తాగితే ఉద్యోగం ఊడబీకుడే: సీఎం సంచలన నిర్ణయం

16 Feb, 2021 16:15 IST|Sakshi

బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ ఆదేశాలు

పాట్నా: రాష్ట్రంలో విధించిన సంపూర్ణ మద్య నిషేధాన్ని పటిష్టంగా అమలు చేస్తున్న బిహార్‌ ప్రభుత్వం తాజాగా మరింత పక్కాగా అమలు చేసేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసులు కూడా మద్యం తాగకూడదని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీసుల అంశంపై బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ దీనికి సంబంధించిన విషయమై ఆదేశాలు జారీ చేశారు.

బిహార్‌లో సంపూర్ణ మధ్య నిషేధం 2016లో అమల్లోకి వచ్చింది. మద్య నిషేధాన్ని పక్కాగా అమలు చేయడానికి సీఎం నితీశ్‌ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గ్రామాల్లో పూర్తిగా మద్యపాన నిషేధం అమలు చేసే బాధ్యతను చౌకీదార్లకు అప్పగించిన విషయం తెలిసిందే. గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తూ దొరికితే దానికి బాధ్యులుగా చౌకీదారులపై చర్యలు తీసుకోవాలనే ఆదేశాల ఉండడంతో పక్కాగా మద్య నిషేధం అమల్లో ఉంది. ఇప్పుడు సంపూర్ణంగా మద్యం నిషేధంలో భాగంగా పోలీసులపై కూడా చర్యలు తీసుకోనున్నారు.

రాష్ట్రంలో పోలీసులు ఎవరైనా మద్యం తాగి విధుల్లోకి వస్తే వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని సీఎం నితీశ్‌ నిర్ణయించారు. పోలీసులు ఎవరైనా తాగి కనిపిస్తే వారిని తక్షణమే డిస్మిస్ చేయాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో పోలీసులంతా తాము మద్యం తాగబోమని ప్రతిజ్ఞ కూడా చేయాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఈ విధంగా బిహార్‌లో సంపూర్ణ మద్య నిషేధానికి చర్యలు తీసుకుంటున్నారు. అయితే రెండేళ్లుగా మద్య నిషేధం అమల్లో ఉన్నా మద్యం సేవించిన పోలీసులను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఆ విధంగా ఏకంగా 400 మంది పోలీసులపై చర్యలు తీసుకున్నారు.

సుశాంత్ సింగ్ కజిన్‌ మంత్రి అయ్యాడు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు