పెళ్లి వాయిదా వేస్కోండి ప్లీజ్‌.. ముఖ్యమంత్రి విజ్ఞప్తి

5 May, 2021 17:41 IST|Sakshi

పాట్నా: కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి వివాహాలు, ఇతర సామాజిక కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర ప్రజలను కోరారు. బీహార్ రాష్ట్రంలో 10 రోజుల లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ మేరకు ఆయన ట్వీటర్‌లో పేర్కొన్నారు. "కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం కఠిన చర్యలు  తీసుకోవాల్సి వ‌స్తుంద‌న్నారు. ఈ రోజు నుంచి మే 15 వరకు దయచేసి కోవిడ్ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందిగా" కోరారు.

లాక్‌డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందని పాట్నా హైకోర్టు హెచ్చరించిన కొన్ని గంటల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్  విధించారు. లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం,వివాహాలకు 50 మందికి మించి పాల్గొనకూడదు, అంత్యక్రియల్లో 20 మంది లోపు మాత్రమే పాల్గొనాలి. ఈ కాలంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మూసివేయబడతాయి. పౌర రక్షణ, విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, అగ్నిమాపక సేవలు, పశువైద్య పనులు, పోస్టల్, టెలికమ్యూనికేషన్ వంటి అవసరమైన సేవలకు అనుమతించారు. ఉద‌యం 7 నుండి 11 గంట‌ల మ‌ధ్య మాత్ర‌మే కిరాణా దుకాణాలు కొన‌సాగించేందుకు అనుమ‌తి ఉంది. బిహార్‌లో ప్ర‌తీరోజు 10 వేల‌కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి.

చదవండి:

మీ ఆధార్ కార్డు ఎవరైనా వాడుతున్నారని అనుమానం ఉందా?

మరిన్ని వార్తలు