వీడియో: ‘మీ అమ్మనో.. అక్కనో.. వీడియోలు తీయండ్రా!’.. అసలు కథ వేరే ఉంది!

19 Oct, 2022 08:26 IST|Sakshi

వైరల్‌:  ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రి గదిలో ఒకరోజంతా బంధించి మరీ ఇద్దరు యువకులను కర్రలతో చితకబాదింది స్టాఫ్‌ నర్స్‌. వద్దని వేడుకుంటున్న ఆమె వాళ్లను వదల్లేదు. ఈ వీడియో వైరల్‌ కావడంతో దుమారం చెలరేగింది. బీహార్‌ సరన్‌ జిల్లాలోని ఛప్రా జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

మెడికల్‌ సర్టిఫికెట్‌ కావాలంటూ ఇద్దరు కుర్రాళ్లు ఆస్పత్రికి వచ్చారు. అయితే  ప్రభుత్వాసుపత్రిలో నిర్వాహణ సరిగా లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును యువకులిద్దరూ చాటుగా వీడియో తీసే యత్నం చేశారని తెలుస్తోంది. ఇది గమనించిన సిబ్బంది వారిద్దరినీ అడ్డుకున్నారు. ఆపై వాళ్లను ఓ గదిలో బంధించి హింసించడం మొదలుపెట్టారు. 

ఓ నర్సు వాళ్లిద్దరినీ కర్రలతో చితకబాదగా.. మరో నర్స్‌ ఆమె వెంట ఉంది. ‘‘ఫొటోలు, వీడియోలు తీస్తార్రా? ఇంటికి వెళ్లి మీ అక్కనో.. అమ్మనో.. వీడియో తీయండ్రా. ముందు ఆ ఫోన్‌లోని వీడియో తీసేయండ్రా’’ అంటూ ఆమె వాళ్ల మీద అరుస్తూ ఉంది. ఒకరోజంతా వాళ్లకు అలా బడిత పూజ జరుగుతూనే ఉంది. చివరకు ఆస్పత్రి సూపరిండెంట్‌ జోక్యం చేసుకోవడంతో ఆ కుర్రాళ్లను సిబ్బంది విడిచిపెట్టారు. అయితే స్టాఫ్‌ నర్స్‌ దాడి చేసిన దృశ్యాలు ఎలాగోలా బయటకు వచ్చాయి. 

దీంతో ఆరోగ్య శాఖను చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. అదే సమయంలో కుర్రాళ్లు నర్సులతో అసభ్యంగా ప్రవర్తించి ఉంటారని, అందుకే నర్సులు అలా చేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. అసలేం జరిగింది అనేది.. ఈ ఘటనపై బీహార్‌ ఆరోగ్య శాఖ స్పందిస్తేనే తెలుస్తుంది.

ఇదీ చదవండి: అబ్బా..  ఏం చావురా ఇది!

మరిన్ని వార్తలు