పేలిపోయిన ఇల్లు.. ఆరుగురు మృతి.. 8 మందికి గాయాలు

24 Jul, 2022 19:39 IST|Sakshi

పట్నా: బిహార్ సారణ్‌ జిల్లా ఛప్రాలోని కోదాయిబాగ్‌ గ్రామంలో  ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా వ్యాపారి ఇల్లు పేలి ఆరుగురు మరణించారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు చెప్పారు.

నది ఒడ్డున ఉన్న ఈ ఇంట్లో బాణసంచా భారీగా ఉండటం వల్లే పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ధాటికి ఇల్లు సగభాగం బద్దలవ్వగా.. మిగతా భాగానికి మంటలు అంటుకున్నాయి. ప్రమాదానికి గురైన ఇంటి చట్టుపక్కల ఉ‍న్న మరో ఆరు ఇళ్లకు కూడా పగుళ్లు వచ్చాయంటే పేలుడు తీవ్రత అర్థమవుతోంది.

ఈ ఇంటి యజమాని రియాజ్ మియాన్‌.. భారీ పరిమాణంలో బాణసంచాను అక్రమంగా నిల్వచేసినట్లు తెలుస్తోంది. స్థానికంగా జరిగే పెళ్లిళ్లకు టపాసులు సరఫరా చేయడమే గాక, ఇంట్లోనే అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్నట్లు సమాచారం. అధికారులు మాత్రం పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఫోరెన్సిక్ నిపుణుల బృందం, బాంబ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
చదవండి: కూతురిపై ఆరోపణలు.. కాంగ్రెస్ నేతలకు స్మృతి ఇరానీ లీగల్ నోటీసులు

మరిన్ని వార్తలు